నేటి సాక్షి, బెజ్జంకి:బెజ్జంకి మోడల్ స్కూల్లో గురువారం విద్యార్థినీ విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు,మరియు ఏక రూప దుస్తులు పంపిణీ కార్యక్రమం ప్రిన్సిపాల్ సంగీత ఆధ్వర్యంలో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మార్కెట్ కమిటీ చైర్మన్ పులికృష్ణ పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మోడల్ స్కూల్లో అందుబాటులో ఉన్న అత్యుత్తమ సదుపాయాలను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని మంచి భవిష్యత్ కోసం చదువుతో పాటు శ్రద్ధ, క్రమశిక్షణ కూడా అవసరం” అని అన్నారు.ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ డైరెక్టర్లు బండిపల్లి రాజు, ఎర్రల రాజు ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.





