Saturday, March 7, 2026

లోక్ అదాలత్ ను కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలి

వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్* నేటి సాక్షి ఉమ్మడి వరంగల్ (సందెల రాజు)ఈ నెల 14 న జరిగే జాతీయ మెగా లోక్ అదాలత్ ను కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలని వరంగల్ పోలీస్ కమిషనర్ తెలిపినారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ ఈ నెల 14న జాతీయ మెగా లోక్ అదాలత్ ఉన్నందున రాజీ పడదగిన కేసులలో, క్రిమినల్ కంపౌండబుల్ కేసులు, సివిల్ తగాదా కేసులు, ఆస్తి విభజన కేసులు, కుటుంబ పరమైన కేసులు, వైవాహిక జీవితానికి సంబంధించిన కేసులు, బ్యాంకు రికవరీ, విద్యుత్ చౌర్యం, చెక్ బౌన్స్ మొదలగు కేసుల్లో కక్షిదారులు రాజీ పడే అవకాశం ఉంటుంది అని తెలిపినారు. రాజీయే రాజ మార్గమన్నారు. చిన్న చిన్న కేసులతో కక్షలు పెంచుకుని కోర్టుల చుట్టూ తిరుగుతూ సమయాన్ని, డబ్బులను వృథా చేసుకోవద్దన్నారు. జుడిషియల్ డిపార్ట్మెంట్ ఇచ్చిన అవకాశాన్ని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. జిల్లా లోని పోలీస్ అధికారులు, కోర్టు విధులు నిర్వహించే కానిస్టేబుల్ లు మరియు ఇతర పోలీస్ సిబ్బంది రాజీ పడ్డ దగిన కేసులను గుర్తించి ఇరువర్గాల వారిని పిలిపించి కౌన్సిలింగ్ నిర్వహించి రాజీ పడేటట్లు అవగాహన కల్పించడం జరుగుతుంది. కావున ఎవరైనా తమ కేసులలో రాజీ కావాలి అనుకున్నవారు పోలీస్ అధికారులకు సంప్రదించాలని, లోక్ అదాలత్ ద్వారా బాధితులకు సత్వరమే న్యాయం జరుగుతుంది అని పోలీస్ కమిషనర్ తెలిపారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News