నేటి సాక్షి తిరుపతి జిల్లా (బాదూరు బాల) గంగాధర నెల్లూరు నియోజకవర్గ పరిధిలోని శ్రీరంగరాజపురం మండలం గ్రామానికి చెందిన వైఎస్ఆర్సిపి సీనియర్ నాయకుడు, మాజీ సైనికుడు ఊమయ్య మృతదేహానికి నివాళులర్పిస్తున్న మాజీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి. ఈ సందర్భంగా మాజీకి డిప్యూటీ నారాయణస్వామి మాట్లాడుతూ. అన్నివేళలా పార్టీని నమ్ముకున్న ప్రతి కుటుంబానికి అండగా ఉంటాననీ, వైఎస్ఆర్సిపి పార్టీ తరఫున ఆదుకుంటామని మృతుని కుటుంబ సభ్యులకు భరోసా కల్పించారు. ఈ కార్యక్రమానికి ఎంపీపీ సరిత జనార్ధన్, ఎంపిటిసి సభ్యులు సిద్దయ్య,సర్పంచ్ హరితా కుప్పయ్య, నాయకులు భూపతి రెడ్డి, యోగానందం, జయ, తదితరులు పాల్గొన్నారు.

