నేటి సాక్షి ప్రతినిధి,మహేశ్వరం(చిక్కిరి.శ్రీకాంత్)
మహేశ్వరం నియోజకవర్గం తుక్కుగూడ మున్సిపాలిటీ పరిధిలోని తుక్కుగూడ టౌన్ లో నూతనంగా ఏర్పాటుచేసిన శ్లోక ఇంటర్నేషనల్ స్కూల్ ప్రారంభోత్సవ వేడుకల్లో ముఖ్య అతిథులుగా మెదక్ పార్లమెంట్ సభ్యులు మాధవనేని రఘునందన్ రావు తెలంగాణ శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, మహేశ్వరం నియోజకవర్గ బిజెపి ఇన్చార్జ్ అందెల శ్రీరాములు హాజరై రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా శ్లోక యాజమాన్యం ముఖ్య అతిథులను ఘనంగా స్వాగతించి సత్కరించారు. అనంతరం రఘునందన్ రావు మాట్లాడుతూ విద్యారంగం ద్వారా సమాజాభివృద్ధి సాధ్యమని పిల్లలకు మంచి భవిష్యత్తు కల్పించాలంటే నాణ్యమైన విద్య అవసరమని శ్లోక ఇంటర్నేషనల్ స్కూల్ ఈ లక్ష్యానికి దోహద పడుతుంది అని తెలిపారు. శ్రీరాములు మాట్లాడుతూ.. మహేశ్వరం నియోజకవర్గానికి ఒక ప్రమాణిక విద్యాసంస్థగా శ్లోక స్కూల్ ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని..ఈ సందర్భంగా శ్లోక విద్యాసంస్థల యాజమాన్యానికి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో తుక్కుగూడ మున్సిపాలిటీ మాజీ చైర్మన్ మరియు బిజెపి అధ్యక్షురాలు బరిగెల హేమలత రాజు గౌడ్, మాజీ కౌన్సిలర్లు శివకుమార్ గౌడ్, జాపాల సుధాకర్, రాజామౌని రాజు ముదిరాజ్, శివయ్య గౌడ్, బోధ యాదగిరి రెడ్డి, ఓబిసి మూర్చ రాష్ట్ర నాయకులు నీటు శ్రీశైలం గౌడ్, మాజీ ప్రధాన కార్యదర్శి కృష్ణ గౌడ్, జిల్లా దిశ కమిటీ సభ్యులు అంబోజి శ్రీనివాస్, బిజెపి సీనియర్ నాయకులు బాలరాజ్, రవి నాయక్, దేవేందర్ నాయక్ మరియు బీజేవైఎం నాయకులు పాల్గొన్నారు.

