Saturday, March 14, 2026

ఆసుపత్రి అభివృద్ధి పనులను పరిశీలించిన జిల్లా కలెక్టర్

నేటి సాక్షి – ధర్మపురి

జగిత్యాల జిల్లా ధర్మపురి మండలం కేంద్రంలోని సామాజిక ఆరోగ్య కేంద్రం మరియు మాతా శిశు ఆరోగ్య కేంద్రం భవన నిర్మాణ పనులను జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ పరిశీలించారు.

శుక్రవారం రోజున జగిత్యాల జిల్లాలోని ధర్మపురి పట్టణ కేంద్రంలో సామాజిక ఆరోగ్య కేంద్రం మరియు మాతా శిశు ఆరోగ్య కేంద్రం భవన నిర్మాణ పెండింగ్ పనులను జిల్లా కలెక్టర్ సత్య ప్రసాద్ పర్యవేక్షించారు.సామాజిక ఆరోగ్య కేంద్రంలోని 50 పడకల గదులను 100 పడకల గదులుగా మార్చిన భవనం నిర్మాణ పనులను పూర్తికాని పెండింగ్ పనులపై వేగవంతంగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.మాతా శిశువు ఆరోగ్య కేంద్రం నూతన ఏర్పాటుచేసిన 50 పడగల భవన నిర్మాణ పనులను పరిశీలించారు పూర్తికాని పనులు ఉన్నట్లయితే వేగవంతంగా పూర్తిచేయాలని అధికారులకు కాంపౌండ్ వాల్ విద్యుత్తు ప్లంబింగ్ లాంటివి పనులు ఉన్నట్లయితే వెంటనే పూర్తి చేయాలని అధికారులకు ఆదేశించారు.కలెక్టర్ వెంట ధర్మపురి ఇన్చార్జ్ తహసిల్దార్ సుమన్ ఎంపీడీవో మరియు ఆర్ ఎం ఓ రామకృష్ణ రెడ్డి సంబంధిత అధికారులు ఉన్నారు.


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News