*నేటిసాక్షి, నల్లబెల్లి*పేద మధ్యతరగతి ప్రజలకు సామాజిక న్యాయం జరగాలంటే సీపీఐ పార్టీలో చేరాలని సీపీఐ కార్యదర్శి అక్కపెల్లి రమేష్ పిలుపునిచ్చారు. మామిండ్ల పెద్ద ఐలయ్య అధ్యక్షతన మండల కేంద్రంలోని సుమంగళి ఫంక్షన్ హల్ లో ఏర్పాటు చేసిన మండల స్థాయి సమావేశానికి ఆయన ముఖ్య అతిధిగా సోమవారం పాల్గొని మాట్లాడుతూ…..అణగారిన కులాలు వర్గాల సమస్యలను పాలకవర్గాలు పెట్టుబడి దారీ పార్టీలు పరిష్కరించడం లేదనీ అందువల్లనే దేశంలో విద్యా వైద్యం,ఉద్యోగ ఉపాధి అవకాశాలు లేక యువత చేతివృత్తుల, చిన్న మధ్యతరగతి వ్యాపార వర్గాలు, రైతు కూలీలలో అశాంతి అలజడులు తలెత్తుతున్నాయనీ, ఈ సమస్యలు పరిష్కరింపబడాలంటే సామాజిక కులాలు అన్ని వర్గాల ప్రజలు యువకులు సిపిఐ లో చేరాలన్నారు. ఈ దేశంలో 50 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ మధ్యలో సంకీర్ణ ప్రభుత్వాలు, 12 సంవత్సరాలు బిజెపి కేంద్రంలో పరిపాలన చేసిన రాష్ట్రంలో 35 సంవత్సరాలు కాంగ్రెస్, మూడుసార్లు తెలుగుదేశం పార్టీ,రెండుసార్లు కేసీఆర్ నాయకత్వంలో బీఆర్ఎస్ పార్టీ పరిపాలన కొనసాగించినప్పటికీ, ఏ ఒక్క వర్గం సంతోషంగా లేదనీ అన్నారు. ఎటువంటి హేతుబద్ధత లేకుండా అగ్రవర్ణాలకు రాజ్యాంగ సవరణ చేసి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు ఇచ్చిన మోడీ బిజెపి ప్రభుత్వం 56% ఉన్న బీసీ కులాలకు విద్య, ఉద్యోగ స్థానిక చట్టసభలలో రిజర్వేషన్లు కల్పించకుండా దేశ సంపదను ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ అగ్రవర్ణాల పేదలకు పంచకుండా కేవలం 120 మంది అగ్రవర్ణ కార్పొరేట్లకు మాత్రమే కట్టబెడుతున్నాడన్నారు. వ్యవసాయ రంగం ప్రధాన వనరుగా ఉన్న భారతదేశంలో ఉన్న భూమిని కార్పొరేట్లకు కట్టబెట్టడానికే రైతు వ్యతిరేక చట్టాలు తెచ్చాడన్నారు రైతాంగం నుండి వ్యతిరేకత రావడం వల్ల రైతు వ్యతిరేక చట్టాలను ఉపసంహరించుకున్నట్లు ప్రకటించిన పరోక్షంగా రైతులకు వ్యతిరేక విధానాలనే అమలు చేస్తున్నారన్నారు. రైతులు పండించిన ఉత్పత్తులను సకాలంలో కొనడానికి సీసీఐ మార్క్ పేడ్ లాంటి సంస్థలను బలోపేతం చేయకుండా అనేక షరతులతో రైతాంగ పంటలను కొనుగోలు చేస్తూ అమెరికాతో ఇతర అభివృద్ధి చెందిన దేశాల పంట ఉత్పత్తులను ఎలాంటి సుంకాలు లేకుండా దిగుమతి చేసుకోవడం వల్ల దేశీయ రైతాంగం ఆత్మహత్యలు చేసుకుంటున్నారన్నారు.యూపీఏ ప్రభుత్వంలో మద్దతుగా ఉన్న వామపక్ష పార్టీలు ఈ దేశంలో స్వామినాథన్ కమిటీ సిఫారసులు అమలు చేయాలని, సమాచార హక్కు చట్టం అటవీ హక్కుల చట్టం వ్యవసాయ కార్మికులకు సమగ్ర చట్టం తేవడానికి ఎంతో కృషి చేశాయని అన్నారు ఈ చట్టాలు రావడం జరిగిందన్నారు కానీ నేడు మోడీ ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ బీసీలకు అనుకూలమైన ఈ చట్టాలను రద్దు చేయడానికి పూనుకున్నాడని అన్నారు. అదేవిధంగా సకలజనుల సమస్యల పరిష్కారానికి తెలంగాణ రాష్ట్ర సాధన ముఖ్యమని చెప్పిన కేసీఆర్ అధికారం మీదికి వచ్చిన తర్వాత అన్ని హామీలను విస్మరించడం వల్లనే తిరిగి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందన్నారు. ఎన్నికలకు ముందు కేసీఆర్ ప్రభుత్వం వైఫల్యాలను ఎండగట్టి అధికారం లోపలికి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం కూడా బీసీ రిజర్వేషన్లు విద్యా వైద్యం ఉద్యోగాలు ఉపాధి అవకాశాలను పట్టించుకోకుండా దాటవేస్తుందన్నారు. రాష్ట్రంలో సింగరేణి కార్మికులు, ఆర్టీసీ కార్మికులు, మున్సిపల్ కార్మికులు ఆందోళన బాట పట్టారని కార్మిక చట్టాలను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విస్మరిస్తున్నాయన్నారు. ప్రైవేటీకరణ చేయడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పోటీ పడుతున్నాయన్నారం.పైగా కార్మికుల హక్కులను కాలరాసే విధంగా మోడీ ప్రభుత్వం నాలుగు లేబర్ కోర్టులను తెచ్చిందన్నారు.సిపిఐ జిల్లా కౌన్సిల్ సభ్యులు చింతకింది కుమారస్వామి మాట్లాడుతూ… రాష్ట్రంలోని గ్రామపంచాయతీ మల్టీపర్పస్ వర్కర్ లకు మినిమం వేజెస్ ఇవ్వకుండా ప్రభుత్వం వారి శ్రమను దోపిడీ చేస్తుందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా గ్రామపంచాయతీ మల్టీపర్పస్ వర్కర్లకు మినిమం వేజెస్ చట్ట ప్రకారం 26 వేల రూపాయలు జీతం ఇవ్వాలన్నారు.ఆఫ్ లైన్ లో పని చేస్తున్న కార్మికులను తక్షణమే ఆన్లైన్ కార్మికులుగా నమోదు చేయాలని గ్రామపంచాయతీ పారిశుద్ధ్య సిబ్బందిని ప్రభుత్వ కార్మికులుగా గుర్తించాలని అన్నారు. ఈ సమావేశంలో సిపిఐ పార్టీ మండల కార్యదర్శిగా బట్టు సాంబయ్యను, ఏఐవైఎఫ్ మండల అధ్యక్ష కార్యదర్శులుగా కడియాల క్రాంతి కుమార్, మర్రి రమేష్ లను, ఏఐటీయూసీ మండల కార్యదర్శిగా పార్టీ సహాయ కార్యదర్శిగా కందిక రమేష్, ను చేతివృత్తుదారుల మండల కార్యదర్శిగా ఓదెల రవిని, రైతు సంఘం మండల కార్యదర్శిగా మామిండ్ల పెద్ద ఐలయ్యను,నల్లబెల్లి గ్రామ పార్టీ కార్యదర్శిగా కనకం సాల్మను, సహాయ కార్యదర్శిగా మర్రి రమేష్, ను ఎన్నుకున్నారు. ఈ సమావేశంలో కోర్నేలు రాములు, తదితరులు పాల్గొన్నారు.





