నేటి సాక్షి,నారాయణపేట ఏప్రిల్ 27 ( రిపోర్టర్ ఇమామ్ సాబ్ ), నారాయణపేట జిల్లా నూతన కలెక్టర్ గా బాధ్యతలను స్వీకరించిన సిహెచ్ ప్రియాంక ఐఏఎస్ గారి ని పి ఆర్ టి యు టి ఎస్ నారాయణపేట జిల్లా శాఖ ఆధ్వర్యంలో సోమవారం వారి కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి మొక్కను, నోటు పుస్తకాలను అందజేశి, సన్మానం చేశారు.ఈ సందర్భంగా వారు జిల్లా విద్యాశాఖ వివరాలను అడగడంతో పాటు, ప్రస్తుతము నిర్వహిస్తున్న జనగణనలో ఇండ్ల గుర్తింపును ఉపాధ్యాయులు స్వీయ నమోదును చేసుకోవడంతోపాటు వారు నివసిస్తున్న ప్రాంతాలలో వారికి తెలిసిన అందరినీ స్వీయ నమోదు చేసుకునేలా ప్రోత్సహించాలని సూచించారు. స్వీయ నమోదు పెరుగుదలకు పిఆర్టియు సంఘం ఆధ్వర్యంలో తప్పకుండా సహకరిస్తామని జిల్లా బాధ్యులు కలెక్టర్ గారికి తెలియజేశారు. అదేవిధంగా జిల్లాలో విద్యారంగ అభివృద్ధికి అందరం కలిసికట్టుగా పనిచేద్దామని తాను అందరికీ అందుబాటులో ఉంటానని అన్నారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షురాలు వరలక్ష్మి సంతోష్ కుమార్, శశిరేఖ బాలాజీ,జిల్లా అధ్యక్షులు యాద్గిర్ జనార్దన్ రెడ్డి, నారాయణపేట మండల అధ్యక్షులు ఎం. రఘువీర్,దామరగిద్ద మండల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు సత్యనారాయణ రెడ్డి,రమేషు, జిల్లా సైన్స్ అధికారి భాను ప్రకాష్, రాష్ట్ర బాధ్యులు కే శ్రీనివాస్,జిల్లా బాధ్యులు విశ్వనాథ్, అరవింద్,బాలాజీ, పి అర్ టి యు సభ్యులు వెంకటేశ్వర్లు ,రైజావేగం, వేదవతి,శ్రీదేవి తదితరులు పాల్గొన్నారు.





