నేటి సాక్షి చిలుకూరు ప్రపంచ కార్మికుల పండుగ రోజు అయిన మే 1న మేడే ఉత్సవాలు ఘనంగా నిర్వహించుకోవాలని సోమవారం చిలుకూరు మండల కేంద్రంలో మండల పార్టీ కార్యాలయం డి ఎన్ భవనంలో కస్తూరి సైదులు అధ్యక్షతన జరిగిన సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ 1881లో అమెరికా నడిబొడ్డున చికాకో నగరంలో లక్షలాది మంది కార్మికులు ప్రాణాలర్పించి రక్తం చిందించి సాధించుకున్న 8 గంటల పని విధానాన్ని నేడు కేంద్రంలో బిజెపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కార్మికుల హక్కులను హరించి వేస్తూ 44 చట్టాలను నాలుగు లేబర్ కోడ్ గా విభజించి 12 గంటలు పనిని పొడిగిస్తూ కార్మికుల శ్రమను దోపిడీనీ తెరలేపారని మండిపడ్డారు. కార్పొరేట్ శక్తులను పెంచి పోషిస్తూ కార్మికుల శ్రమను దోచుకుంటున్న మతతత్వ బిజెపి పార్టీని గద్దె దిగేవరకు పోరాడాలని అన్నారు. రాజకీయ పార్టీల పేరుతో సంఘాలను విడదీస్తూ వారి పబ్బం గడుపుతున్నారని కార్మికులంతా వారి కుట్రలను పసిగట్టి అన్ని సంఘాలు, సంఘటితమై తమ హక్కులు సాధన కోసం సమరశీల పోరాటాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. *ఈ సమావేశంలో చిలుకూరు మండల కార్యదర్శి మండవ వెంకటేశ్వర్లు, సహాయ కార్యదర్శి ఎస్కె సాయిబెల్లి, కే వెంకటయ్య, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు రేమిడాల రాజు, ఏఐవైఎఫ్ జిల్లా కార్యదర్శి చేపూరి కొండలు, శీలవేరి ఆంజనేయులు తాలూరి వెంకటయ్య, దొడ్డ నాగేశ్వరావు, కస్తూరి సత్యం, అలివేలు, పెద్ద మల్లయ్య, కోడరీ శ్రీను తదితరులు పాల్గొన్నారు*.





