జిల్లా తొలి జడ్పీ చైర్ పర్సన్ దావ వసంత సురేష్ నేటి సాక్షి, రాయికల్ : తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల ఆరోగ్యం పట్ల నిర్లక్ష్యం కనబరుస్తుందని జిల్లా తొలి జడ్పీ చైర్ పర్సన్ దావ వసంత సురేష్ విమర్శించారు. శుక్రవారం రాయికల్ పట్టణంలోని పలు వార్డులు ఆమె బిఆర్ఎస్ శ్రేణులతో కలిసి కలియతిరిగారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ కెసిఆర్ పాలన సంక్షేమం, అభివృద్ధి తో పాటు ప్రజల ఆరోగ్యమే ధ్యేయంగా పని చేస్తే, ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల ఆరోగ్యాన్ని గాలికి వదిలేసిందని అన్నారు. రాయికల్ లో సానిటేషన్ మీద కనీస పాలకులు, అధికారులు కనీస శ్రద్ధ చూపడంలేదని వాపోయారు. అప్పటి ఎంపి కవిత కృషి వల్లే రాయికల్ గ్రామ పంచాయతీ నుండి మున్సిపాలిటీగా ఏర్పాటు అయిందన్నారు. పట్టణ అభివృద్ధి కోసం మంజూరు చేసిన రూ.25 కోట్ల నిధులతో ఇంకా రెండున్నర కోట్ల రూపాయల మిగిలి ఉండడంతో ఆ మిగిలిన నిధులతో పట్టణంలోని అసంపూర్తిగా ఉన్న రోడ్లు మరియు డ్రైనేజీలను పూర్తి చేయాలని అన్నారు. డ్రైనేజీ లేక వర్షాల వల్ల ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారని, డెంగ్యూ , మలేరియా వంటి సీజనల్ వ్యాధులు ప్రభలే ప్రమాదం ఉందన్నారు. డ్రైనేజీలు, రోడ్ల నిర్మాణ పనులు చేపట్టి ప్రజలను సీజనల్ వ్యాధుల నుండి కాపాడాలని సూచించారు. వీరి వెంట రాయికల్ పట్టణ అధ్యక్షులు ఎలిగేటి అనిల్, కో ఆర్డినేటర్ తురగ శ్రీధర్ రెడ్డి , మండల అధ్యక్షులు బర్కం మల్లేష్ , మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ ఎనగందుల ఉదయశ్రీ, నాయకులు మహేష్ గౌడ్, తిరుపతి, ప్రశాంత్ రావు, రామ్ చంద్ర, వినోద్, ప్రసాద్, మహేష్ తదితరులు పాల్గొన్నారు.ఫోటో రైటప్: 20RKL02: వార్డుల్లో కలియతిరుగుతున్న దావ వసంత, పార్టీ శ్రేణులు





