నేటి సాక్షి పాలేరు, జూన్ 28 :
వివిధ చికిత్సల అనంతరం ముఖ్యమంత్రి సహాయనిధి (సీఎంఆర్ఎఫ్)కి దరఖాస్తు చేసుకున్న వారికి మంజూరైన చెక్కులను కూసుమంచి క్యాంప్ కార్యాలయంలో శనివారం క్యాంప్ కార్యాలయం ఇంచార్జి భీమిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి లబ్ధిదారులకు పంపిణీ చేశారు.. పాలేరు శాసన సభ్యులు, రాష్ట్ర రెవెన్యూ, గృహనిర్మాణ, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సిఫారసు మేరకు మంజూరైన 79 చెక్కులకు గాను రూ.25,00000/-(లక్షలు) పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఇంచార్జి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ.. “అత్యవసర ఆరోగ్య సమస్యలున్న వారికి అపన్న హస్తంగా ముఖ్యమంత్రి సహాయ నిధి ఉపయోగ పడుతుంది. సీఎంఆర్ఎఫ్ బాధితులకు భరోసా కలిగిస్తున్నది అని అన్నారు”. తమకు సీఎంఆర్ఎఫ్ నిధులు రావడానికి సహకరించిన మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డికి లబ్ధిదారులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సిడిసి చైర్మన్ ఏర్రబోలు సూర్యనారాయణ రెడ్డి, మార్కెట్ కమిటీ డైరెక్ట్ లు బొంగ నాయక్, మొక్క ఉపేందర్, జీళ్ళచేరువు గుడి చైర్మన్ సత్యనారాయణ, నాయకులు జొన్నలగడ్డ రవికుమార్, మాదాసు ఉపేందర్ రావు, మాజీ మార్కెట్ చైర్మన్ వడిత్య సేట్రం, మాజీ ఎంపిపి జూకురి గోపాలరావు, నాయకులు కేశవరెడ్డి, బొల్లంపల్లి సుధాకర్ రెడ్డి, బజ్జురి వెంకట్రెడ్డి, చాట్ల పరుశురాం, కంచర్ల జీవన్ రెడ్డి, బిష్మ చారి, వీరభద్రం, చిలకబత్తిని రామారావు, రామిరెడ్డి, పేండ్ర అంజయ్య, ఐతగాని నాగేశ్వరరావు, ఇంటూరి పుల్లయ్య, చందర్,అర్వపల్లి మల్లికార్జున్, పిట్ట సత్యనారాయణ రెడ్డి, మీరా సాహెబ్, యూత్ విభాగం బెల్లంకొండ శరత్ గౌడ్, కొండ మహిపాల్, మొహమ్మద్ రఫీ, వడిత్య కుమార్ నాయక్, వడిత్య సైదా నాయక్ తదితరులు పాల్గొన్నారు.





