*నేటిసాక్షి* ఏప్రిల్ 25 తిరుమలాయపాలెం (రుద్రరాజు)సుబ్లేడ్ గ్రామంలో ప్రజా దర్బారుకు హాజరైన తెలంగాణ రాష్ట్ర రెవెన్యూ శాఖ మాత్యులు గౌరవ శ్రీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి ఆశ వర్కర్లు సమస్యలతో కూడిన వినతిపత్రాన్ని అందజేశారు ఈ సందర్భంగా సిఐటి మండల కార్యదర్శి వసపొంగు వీరన్న మంత్రి గారికి వివరిస్తూ ఎన్నికల మేనిఫెస్టో కాంగ్రెస్ పెట్టిన విధంగా ఆశలకు ఫిక్స్డ్ వేతనము 18000 ఇవ్వాలని వారు చాలీసాలని జీతాలతోనే జీవితాలు ఎలా తీస్తున్నారని వారిని వెంటనే తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ఆదుకునే వేతనాలు పెంచాలని అతను పనికి అదరపువేతన ఇవ్వాలని పెండింగ్ బిల్లులు చెల్లించాలని వారు విజ్ఞప్తి చేశారు ఆశా సమస్యలు పరిష్కరిస్తూ తక్షణమే చర్యలు చేపట్టాలనితదితర డిమాండ్స్ తో కూడిన వినతిపత్రాన్ని మంత్రి గారికి అందజేశారు ఈ కార్యక్రమంలో ఆశా వర్కర్స్ యూనియన్ ప్రతినిధులు మోటమర్రి నాగేంద్ర లత సత్యవతి లక్ష్మి స్వాతి మమత పుష్పలత మమత తదితరులు పాల్గొన్నారు





