నేటి సాక్షి, పరిగి. (సురేష్ మోత్కూర్) పరిగి నుండి షాద్నగర్ వరకు జరుగుతున్న నాలుగు లైన్ల రహదారి పనులను పరిగి ఎమ్మెల్యే డాక్టర్ టి.రామ్మోహన్ రెడ్డి గారు పరిశీలించారు.ఈ సందర్భంగా పనుల నాణ్యత, వేగంపై అధికారులతో ఫోన్ ద్వారా మాట్లాడి,నిర్దిష్ట గడువులో పూర్తి చేయాలని ఆదేశించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ…పరిగి నుండి షాద్నగర్ వరకు గతంలో సింగిల్ రోడ్డు ఉండగా,దానిని డబుల్ రోడ్డు చేసి,ప్రస్తుతం నాలుగు లైన్లుగా విస్తరించే పనులు వేగంగా జరుగుతున్నాయని తెలిపారు.పరిగి – వికారాబాద్ వరకు నాలుగు లైన్ల రహదారి పనులు కొనసాగుతున్నాయని,లాల్ పహాడ్ నుండి చిట్టెంపల్లి వరకు డబుల్ రోడ్డు, గడిసింగాపూర్ నుండి రంగారెడ్డిపల్లి వరకు డబుల్ రోడ్డు పనులు జరుగుతున్నాయని వివరించారు.నంచర్ల నుండి రాఘవపూర్ వరకు కూడా డబుల్ రోడ్డు గతంలో ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు వేయించడం జరిగిందని తెలిపారు.రీజినల్ రింగ్ రోడ్ (RRR),రేడియల్ రోడ్లు పరిగి మీదుగా రానున్నాయని,ORR నుంచి షాబాద్ – సయ్యద్పల్లి – మైలారం – బొంరాస్ పేట్ మీదుగా కోస్గి వరకు కొత్త రహదారి ఏర్పడనున్నదని తెలిపారు. ఈ పనులు త్వరలోనేప్రారంభమవుతాయని పేర్కొన్నారు.గత ప్రభుత్వం రోడ్ల అభివృద్ధిని నిర్లక్ష్యం చేయడం వల్ల ప్రమాదాలు పెరిగి ప్రజలు ప్రాణాలు కోల్పోయిన ఘటనలు ఎక్కువయ్యాయని అన్నారు.ఈ పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని ప్రత్యేక శ్రద్ధతో అసెంబ్లీ, సచివాలయంలో మంత్రులు, ముఖ్యమంత్రిని తరచూ కలుస్తూ పరిగి నియోజకవర్గానికి నాలుగు వైపులా రహదారుల అభివృద్ధికి కృషి చేస్తున్నామని తెలిపారు.అదేవిధంగా నియోజకవర్గంలోని ప్రతి గ్రామం,ప్రతి తండాకు బీటి రోడ్లు వేయడానికి ప్రతిపాదనలు ప్రభుత్వం ముందుంచినట్లు తెలిపారు. వచ్చే రెండు సంవత్సరాల్లో అన్ని గ్రామాలకు బీటి రోడ్లు పూర్తి చేస్తామని ఎమ్మెల్యే TRR గారు హామీ ఇచ్చారు.





