నేటి సాక్షి, కొమరం భీమ్ ఆసిఫాబాద్(ఎండి ముబీన్)పట్టణంలోని 17వ వార్డులో శనివారం నిర్వహించిన ‘ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక’ కార్యక్రమం పరిధిలో పారిశుద్ధ్య పనులు విస్తృతంగా చేపట్టబడ్డాయి. ఈ కార్యక్రమాన్ని మున్సిపల్ చైర్పర్సన్ ఆకాష్, వైస్ చైర్పర్సన్ ఎండి అహ్మద్ ఆధ్వర్యంలో నిర్వహించారు.ఈ సందర్భంగా చైర్పర్సన్ ఆకాష్, వైస్ చైర్పర్సన్ ఎండి అహ్మద్, మున్సిపల్ కమిషనర్ గజానంద్ వార్డులో పర్యటించి పారిశుద్ధ్య పనులను సమీక్షించారు. అలాగే స్థానిక ప్రజలకు తడి చెత్త, పొడి చెత్త వేరు చేయడం పై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు.చైర్పర్సన్ ఆకాష్ మాట్లాడుతూ, పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచడంలో ప్రతి పౌరుడు బాధ్యతగా వ్యవహరించాలని సూచించారు. ఇంటి వద్దే చెత్తను వేరు చేసి మున్సిపల్ వాహనాలకు అందించడం ద్వారా ఆరోగ్యకరమైన వాతావరణాన్ని సృష్టించుకోవచ్చని పేర్కొన్నారు.ప్రగతి ప్రణాళిక ప్రధాన లక్ష్యం ప్రజలకు మెరుగైన సేవలు అందించడం అని తెలిపారు. ఈ క్రమంలో పారిశుద్ధ్య కార్మికులకు ప్రజలు పూర్తి స్థాయిలో సహకరించాలని విజ్ఞప్తి చేశారు.ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ సాలం బిన్ అహ్మద్, బీఆర్ఎస్ నాయకులు సయ్యద్ జావిద్, మున్సిపల్ అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.





