Tuesday, March 10, 2026

మెగా ఆయిల్ పామ్ ప్లాంటేషన్ కార్యక్రమం ప్రారంభం

రైతుల ఆర్థికాభివృద్ధికి కాంగ్రెస్ ముందడుగు:కృష్ణ నాయక్,వైస్ చైర్మన్ సిహెచ్. యాదయ్య.

నేటి సాక్షి ప్రతినిధి,మహేశ్వరం(చిక్కిరి శ్రీకాంత్)

రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గంలోని సరస్వతిగూడా గ్రామంలో మెగా ఆయిల్ పామ్ ప్లాంటేషన్ కార్యక్రమం ప్రారంభమైంది.ఈ కార్యక్రమాన్ని కాంగ్రెస్ పార్టీకి చెందిన ప్రముఖులు ప్రారంభించారు. ఇందులో మహేశ్వరం మార్కెట్ కమిటీ చైర్మన్ కృష్ణ నాయక్,వైస్ చైర్మన్ సిహెచ్. యాదయ్య, టి పి సి సి.ప్రధాన కార్యదర్శి ఏనుగు జంగారెడ్డి,మాజీ జెడ్పిటిసి బొక్క జంగారెడ్డి,మార్కెట్ కమిటీ డైరెక్టర్లు మరియు పాలకవర్గ సభ్యులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ:-దేశంలో ఆయిల్ పామ్ సాగును విస్తరించడంతో వంట నూనెలలో స్వయం సమృద్ధిని సాధించవచ్చు. రైతుల ఆదాయాన్ని పెంచే దిశగా ఇది ఒక గొప్ప అడుగు అని తెలిపారు.కార్యక్రమం లక్ష్యాలు:ఆయిల్ పామ్ సాగు విస్తరణ,దేశీయంగా వంట నూనె ఉత్పత్తిలో స్వయం సమృద్ధి,రైతులకు ఆదాయవృద్ధి,పర్యావరణ పరిరక్షణతో కూడిన సాగు.చేపట్టిన చర్యలు:ఆయిల్ పామ్ మొక్కల నాట్లు,ప్రాసెసింగ్ కేంద్రాల ఏర్పాటుకు చర్యలు,రైతులకు శిక్షణ,అవగాహన కార్యక్రమాలు,అవసరమైన సబ్సిడీలు,మద్దతు నిధులు అందజేత.ఈ కార్యక్రమం ద్వారా మహేశ్వరం నియోజకవర్గం రైతులకు ఆర్థికంగా నూతన దిశను చూపుతుందని నేతలు తెలిపారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News