Tuesday, March 10, 2026

టిజిఎస్పిసిడిఎల్ సీఎండీ ముషరాఫ్ ఫరూకిని కలిసిన బీజేపీ కార్పొరేటర్లు

సమస్యల పరిష్కారానికి వినతిపత్రం.

నేటి సాక్షి ప్రతినిధి,మహేశ్వరం(చిక్కిరి శ్రీకాంత్)

:బీజేపీ కార్పొరేటర్లు శ్రవణ్,ఆకుల శ్రీవాణి,మహేందర్ టి జి ఎస్ పి సి డి ఎల్ సిఎండి ముషరాఫ్ ఫరూకి ని కలిసి పలు ప్రజాసంబంధిత సమస్యలపై వినతిపత్రం సమర్పించారు. మాట్లాడుతూ – రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన ఆరు గ్యారంటీల అమలులో అనేక మంది లబ్ధిదారులకు పథకాలు అందడంలేదని తెలిపారు.ముఖ్యంగా సిజిజి సాఫ్ట్‌వేర్ లోపాలు,శాఖల్లో టెక్నికల్ ఇష్యూస్ కారణంగా ఈ సమస్యలు ఎదురవుతున్నాయని వివరించారు.అలాగే,3 ఫేస్ కన్వర్షన్ పనులు, కొత్త విద్యుత్ దండల (కరెంటు పోల్స్) ఏర్పాటు కోసం తక్షణమే నిధులు విడుదల చేయాలనీ వారు డిమాండ్ చేశారు. జిహెచ్ఎంసి మరియు టి జి ఎస్ పి సి డి ఎల్ మధ్య సమన్వయ లోపం కారణంగా చెట్ల కొమ్మలు కత్తిరించిన తర్వాత గ్రీన్ వేస్ట్ తొలగించకుండా పడేయబడుతున్నదనీ,ఈ సమస్యను కూడా పరిష్కరించాలని కోరారు.ఇంకా, ట్రాన్స్ఫార్మర్లకు ఫెన్సింగ్ ఏర్పాటు చేయాల్సిన బాధ్యత టి జి ఎస్ పి సి డి ఎల్ స్వీకరించాలని స్పష్టంగా తెలిపారు.కార్పొరేటర్ల వినతులను సానుకూలంగా స్వీకరించిన సిఎండి ముషరాఫ్ ఫరూకి,తక్షణమే ప్రత్యేక అధికారిని ద్వారా నివేదిక తెప్పించి సమస్యల పరిష్కారానికి అవసరమైన చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News