Tuesday, March 10, 2026

యువత రాజకీయాల్లోకి రావాలి

నేటి సాక్షి,మంచిర్యాల జిల్లా

తీన్మార్ మల్లన్న టీం బెల్లంపల్లి నియోజకవర్గం ఇంచార్జి రాంటెంకి శ్రీనివాస్ ఆధ్వర్యంలో బెల్లంపల్లి ఉపాధ్యక్షులు పులుగం రాజేందర్ అధ్యక్షతన తీన్మార్ మల్లన్న టీం ముఖ్య సభ్యుల సమావేశం శనివారం బెల్లంపల్లి పట్టణ కేంద్రంలో నిర్వహించడం జరిగింది.ఇట్టి సమావేశానికి జిల్లా అధ్యక్షులు మహేష్ వర్మ పాల్గొని టీం భవిష్యత్ కార్యాచరణ ప్రకటించారు.ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు మాట్లాడుతూ..స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో తీన్మార్ మల్లన్న ఆశించిన బహుజనుల రాజ్యాధికారమే లక్ష్యంగా టీం సభ్యులు పనిచేయాలని,రానున్న ఎన్నికల్లో బహుజనుల గెలుపే లక్ష్యంగా టీం సభ్యులు పనిచేయాలని కోరారు.అగ్రవర్ణాల నాయకులను ఓడగొట్టి బీసీ,ఎస్సీ,ఎస్టీ,మైనార్టీల సత్తా చాటాలని తెలిపారు.జిల్లా వ్యాప్తంగా వివిధ గ్రామ పంచాయతీల్లో ఉన్న ప్రధాన సమస్యలపైన ప్రశ్నిస్తూ సమస్యల పరిష్కారం దిశగా పనిచేయాలని కోరారు.స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయాలనుకుంటున్న అభ్యర్థుల వివరాలు సేకరించి,పార్టీలకు అతీతంగా ప్రజా సమస్యల పరిష్కారం దిశగా పనిచేయాలనుకుంటున్న వ్యక్తులకు మద్దతు తెలిపి వారి గెలుపుకై పనిచేయాలని సూచించారు.రానున్న ఎన్నికల్లో యువత పోటీ చేసేందుకు ముందుకు రావాలని పిలుపునిచ్చారు.తీన్మార్ మల్లన్న ఆధ్వర్యంలో నూతన రాజకీయాలకు జీవం పోయాలని,అన్ని రంగాల్లో బహుజనులు అభివృద్ధి చెందాలని ఆశించారు.అనంతరం టీం సభ్యులకు నియామక పత్రాలు అందించారు.ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి దీపక్,కార్యదర్శి శివతేజ,కాసిపేట మండల అధ్యక్షులు వేల్పుల కిరణ్, తాండూర్ అధ్యక్షులు వాసాల అనిల్,నెన్నెల అధ్యక్షులు తాళ్ల మహేష్,చంద్ర శేఖర్,శంకర్ తదితరులు పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News