Tuesday, March 10, 2026

ఏఎస్ఐ లక్ష్మీనారాయణ పదవీవిరమణ

నేటిసాక్షి, గన్నేరువరం,(బుర్ర అంజయ్య గౌడ్):
గన్నేరువరం పోలీస్ స్టేషన్లో విధులు నిర్వర్తిస్తున్న ఏఎస్ఐ పాటకుల లక్ష్మీనారాయణ జూన్ 30 వ.తేదీ వరకు విధులు నిర్వర్తించి పదవి విరమణ పొందనున్నారు. పోలీస్ శాఖలో 36 సంవత్సరాలు సేవలను అందించారు. మొదటిగా జగిత్యాల జిల్లా రాయికల్ మండల్ పోలీస్ స్టేషన్లో 1990 సంవత్సరంలో జాయిన్ అయ్యారు. గన్నేరువరం పోలీస్ స్టేషన్లో మూడు నర సంవత్సరాలు సేవలందించి మంచి పేరు తెచ్చుకున్నారు.. ముందస్తుగా లక్ష్మీనారాయణ ను శనివారం నాడు కరీంనగర్ పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో సిపి గౌస్ అలం సన్మానించి జ్ఞాపిక ను అందించారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి కరీంనగర్ జిల్లా పోలీస్ అధికారుల సంఘం జిల్లా అధ్యక్షులు మామిడాల సురేందర్, ఇతర అధికారులు పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News