Tuesday, March 10, 2026

పేదరికం చదువుకు అడ్డుకాకూడదు..

దంత వైద్య విద్యార్థికి చదువు 40 వేలు ఆర్థిక చేయూత..

అందించిన కాంగ్రెస్ నాయకుడు భూక్యా సురేష్ నాయక్..

నేటి సాక్షి పాలేరు ,జూన్ 29 :

పేదరికం చదువుకు అడ్డు కాకూడదనీ దంత వైద్య విద్యార్థినీకి అండగా నిలబడ్డాడు ఖమ్మం జిల్లా యువజన కాంగ్రెస్ నాయకుడు భూక్యా సురేష్ నాయక్.. వివరాలు ఇలా వున్నాయి.. ఖమ్మం కార్పొరేషన్ పరిధిలోని శ్రీనివాస్ నగర్ కు చెందిన పిట్టంపల్లి శ్రీ దివ్యలక్ష్మీ డాక్టర్ కావాలనే లక్ష్యం తో బాగా చదువుకుంది. అనుకున్నట్టుగానే తన లక్ష్య సాధనతో తను కలలు కన్న డాక్టర్ సీటును సంపాదించి హైదరాబాద్ ఘాట్ కేసర్ లోని పనేనియా ఇన్స్టిట్యూట్ అఫ్ డెంటల్ సైన్స్ కాలేజీలో దంత వైధ్య విభాగంలో సీట్ వచ్చింది. దంత వైద్య విద్యానభ్యసిస్తున్న శ్రీ దివ్య తల్లి ఇటీవలే మరణించింది. తండ్రి రాపిడో నడుపుతూ కూతురిని ఎలాగైనా డాక్టర్ చేయాలనీ కష్టపడుతున్నారు. తనకు ఉన్న ఒక అన్న, శ్రీ దివ్య ట్యూషన్ చెబుతూ బిడీఎస్ సెకండ్ ఇయర్ వరకు కష్టపడి చదువు చదివించారు. ప్రస్తుతం శ్రీ దివ్య మూడవ సంవత్సరం వైద్య విద్యకు ఖర్చుల వలన చదువు కొనసాగించలేక మానేసే పరిస్థితి వచ్చింది. ఈ విషయం తెలుసుకొన్న ఖమ్మం జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు భూక్యా సురేష్ నాయక్ నేనున్నాను అంటూ ముందుకు వచ్చి ఆమె చదువు పూర్తి అయ్యే వరకు తాను బాధ్యత తీసుకున్నారు.. ప్రతీ సంవత్సరం అయ్యే 80,000 వేల రూపాయలను తాను కాలేజీ కి కడతాను అని మాట ఇచ్చారు. చదువు తరువాత ఉండే ఇంటర్నషిప్ కోసం అయ్యే ఖర్చు కూడా తానే బరిస్తాను అని చెప్పారు. చెప్పటమే కాకుండా ఆదివారం శ్రీ దివ్య కు తక్షణ సహాయం గా 40,000 వేల రూపాయలు నగదును మంత్రి పొంగులేటి క్యాంపు ఇంచార్జి తుంబురు దయాకర్ రెడ్డి చేతులు మీదుగా ఆమెకు అందజేశారు. అర్ధాంతరంగా చదువు మానేసే వైద్య విద్యార్థికి ఆర్ధిక భరోసా కల్పించిన భూక్యా సురేష్ నాయక్ ను కాంగ్రెస్ నాయకులు మద్దులపల్లీ మార్కెట్ కమిటీ చైర్మన్ బైరు.హరినాథ్ బాబు అభినందించారు.
ఖమ్మం జిల్లాలో ఎవరికి ఏ సమస్య వచ్చిన నేనున్నాను అంటూ సహాయం అందించే గుణం ఉన్నా సురేష్ నాయక్ కు పలువురు అభినందనలు తెలుపుతున్నారు. ఈ కార్యక్రమంలో పాలేరు ఆత్మ కమిటీ డైరెక్టర్ నాగార్జునపు ప్రద్యుమ్న చారి,
పిర్టీయూ తెలంగాణ ఖమ్మం, భద్రాద్రి డిస్ట్రిక్ట్, ఇంచార్జి లు కొమ్మినేని.అనిల్ కుమార్, జావేద్,
చేతన ఫౌండేషన్ ముత్తినేని. సురేష్, సంగయ్య, శేషి రెడ్డి, నాగయ్య, అబ్దుల్,
కృష్ణ, వెంకటేష్, వెంకటరమణ,
నవీన్, మెఫీ మానసిక వికలాంగుల కేంద్రం నిర్వాహకురాలు ప్రమీల,ప్రియాంక తదితరులు పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News