Tuesday, March 10, 2026

ఉప్పల్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు అడ్మిషన్ల వెల్లువ

దోస్త్ మూడవ దశలో డిగ్రీ కళాశాలలో సీట్ పొందిన వారు జూలై 1 లోపు కళాశాలని సందర్శించాలి.

నేటి సాక్షి మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా ప్రతినిధి

డిగ్రీ కళాశాలలకు దోస్త్ (DOST) ద్వారా జరుగుతున్న అడ్మిషన్ల ప్రక్రియలో ఉప్పల్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు విద్యార్థుల నుండి దరఖాస్తులు వెల్లువెత్తాయి. దోస్త్ మూడవ దశలో 100% సీట్ల కేటాయింపు పొందిన 04 ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఒకటిగా రాష్ట్ర స్థాయిలో నిలిచింది. దోస్త్ మూడవదశలో అనుమతించబడిన సీట్లకు అన్నింటికి 100% దరఖాస్తులు సాధించడం జరిగిందని తెలుపుతూ ప్రిన్సిపాల్ డా.కె‌.విజయ్ కుమార్ హర్షం వ్యక్తం చేశారు. కళాశాలలో సీట్లు కేటాయించడిన విద్యార్థులంతా జూలై 01 లోపు కళాశాల కార్యాలయంలో తమ సర్టిఫికేట్ ల జీరాక్స్ లు, మరియు ఇంటర్ టిసి ఒరిజినల్ ఇవ్వాల్సి ఉంటుందని అడ్మిషన్ల దోస్త్ సమన్వయకర్త జె. విశ్వనాథ్ కుమార్ ఒక ప్రకటనలో తెలియజేశారు. అనేకమంది విద్యార్థులు కళాశాలలో చేరాలని కోరుకున్నా‌ . అందరికీ అవకాశం కల్పించలేక పోయామని అలాంటి విద్యార్థులంతా మరోసారి కళాశాలని సందర్శిస్తే సరైన మార్గనిర్దేశనం చేస్తామని వారు తెలియజేశారు‌. ఈ విద్యాసంవత్సరంలో డిగ్రీ మొదటి సంవత్సరంలో చేరబోయే విద్యార్థులందరి కోసం తెలంగాణా ఉన్నత విద్యామండలి టీశాట్ భాగస్వామ్యంతో యూట్యూబ్ లైవ్ వేదికగా సోమవారం ఉదయం 11 గంటలకు ఒక అవగాహనా కార్యక్రమం ఏర్పాటు చేసిందని వారు తెలియజేశారు. విద్యార్థులు మరియు వారి తల్లిదండ్రులు దీనిలో పాల్గొని, తమ భవిష్యత్ ప్రణాళికను గూర్చి 040-23540326/726 ద్వారా సందేహాలు నివృత్తి చేసుకోవచ్చని తెలిపారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News