నేటి సాక్షి (కరీంనగర్)
జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఎల్ఎండి కాలనీ తిమ్మాపూర్ నందు పనిచేస్తున్న మహమ్మద్ భద్రుద్దీన్ ఎస్. ఏ (సోషల్ )గారి ఉద్యోగ విరమణ కార్యక్రమము ప్రధానోపాధ్యాయులు బాల్ కిషన్ గారి ఆధ్వర్యంలో నిర్వహించనైనది, ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా ప్రోగ్రెసివ్ రికగ్నైజ్డ్ టీచర్స్ యూనియన్ తెలంగాణ స్టేట్ కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు అయిలేని కరుణాకర్ రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి మర్రి జైపాల్ రెడ్డి తిమ్మాపూర్ వీణవంక మండల విద్యాధికారులు శ్రీనివాస్,శోభారాణి గార్లు పాల్గొని మాట్లాడుతూ భద్రుద్దీన్ గారు గత 35 సంవత్సరాలుగా విద్యారంగానికి విశేష సేవ చేశారని కొనియాడారు ,వీరు విద్యార్థులతో మమేకమై పాఠశాలలో విద్యార్థుల సంఖ్య పెంచడానికి ఎంతో కృషి చేశారని తెలిపినారు. తాను గతంలో పనిచేసిన పాఠశాలలో కూడా అనేక దాతృత్వ కార్యక్రమాలను నిర్వహించారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో పి.ఆర్.టి.యు రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షుడు అబ్దుల్ జమీల్, మండల బాధ్యులు మారాజు శ్రీనివాస్,రామానుజం మైనార్టీ ఎంప్లాయిస్ వెల్ఫేర్ అసోసియేషన్ బాధ్యులు ఉమర్ అలీ ఉర్దూ టీచర్ జిల్లా బాధ్యులు సర్వర్ షా బియాభాని, ఉపాధ్యాయులు శివకుమార్,రవీందర్,బాలాజీ,సంధ్యారాణి,వసుమతి మరియు వివిధ మండలాల నుంచి ఉర్దూ మీడియం ఉపాధ్యాయులు అధిక సంఖ్యలో పాల్గొని ఘనంగా సన్మానించనైనది





