నేటి సాక్షి,నారాయణపేట, జూన్ 30,
నారాయణపేట జిల్లా లోని నిడుగుర్తి గ్రామంలోని పురాతన శివాలయాన్ని సోమవారం భీష్మ ఫౌండేషన్ సభ్యులు, గ్రామస్తులు, దేవాలయ నిర్వాహకులతో కలిసి సందర్శించిన భీష్మరాజ్ ఫౌండేషన్ చైర్మన్ డాక్టర్ కె.రాజ్ కుమార్ రెడ్డి దేవాలయంలో పూజా కార్యక్రమాలను నిర్వహించారు. అంతకుముందు గ్రామంలో
దేవాలయ సందర్శనకు విచ్చేసిన రాజ్ కుమార్ రెడ్డి గారికి డప్పు వాయిద్యాలు, మేళతాళాలతో దారి పొడువున ఘన స్వాగతం పలికారు.
నిర్మాణంలో ఉన్న దేవాలయం గురించి నిర్వాహకులు, గ్రామస్తులు రాజ్ కుమార్ రెడ్డి గారికి వివరించారు.





