Tuesday, March 10, 2026

మాదకద్రవ్యాల నిర్మూలనకై విద్యార్థులు యువత కృషి చేయాలి- జిల్లా ఎస్పీ కాంతిలాల్ పాటిల్ ఐపీఎస్

కొమరం భీమ్ ఆసిఫాబాద్ ప్రతినిధి జూన్ 30

మాదకద్రవ్యాల దుర్వినియోగం, అక్రమ రవాణ నిర్మూలనకై ప్రభుత్వ జూనియర్ కళాశాల కాగజ్ నగర్ విద్యార్థులకు అవగాహన కార్యక్రమం
ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా ఎస్పీ శ్రీ కాంతిలాల్ పాటిల్ ఐపిఎస్

మాదకద్రవ్యాల దుర్వినియోగం, అక్రమ రవాణ నిర్మూలనకై ఈ రోజు కాగజ్ నగర్ ప్రభుత్వ జూనియర్ కళాశాల నందు నిర్వహించిన అవగాహన కార్యక్రమానికి జిల్లా ఎస్పీ కాంతిలాల్ పాటిల్ ఐపీఎస్ గారు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో భాగంగా జిల్లా ఎస్పీ గారు మాట్లాడుతూ.. మాదకద్రవ్యాల దుర్వినియోగం, అక్రమ రవాణా నిర్మూలనకై ప్రజలు, యువత, విద్యార్థులకు అవగాహన కార్యక్రమాలను నిర్వహించడం జరుగుతుందని, ఎస్పీ గారు అన్నారు. మాదకద్రవ్యాల దుర్వినియోగం వలన కలిగే చెడు పరిణామాలను గుర్తించాలని, గంజాయి, డ్రగ్స్ బారినపడి యువత జీవితాలు కోల్పోతున్నారని అన్నారు. యువత మంచి లక్ష్యాలను పెట్టుకొని వాటిని సాకారం చేసే దిశగా అడుగులు వేయలే కానీ డ్రగ్స్ కు బానిసలుగా మారకూడదన్నారు. యువత అభ్యున్నతికి అవరోధంగా నిలుస్తున్నా గంజాయి, డ్రగ్ వంటి మాదకద్రవ్యాలను సమాజం నుండి సమూలంగా నిర్మూలించడానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని అన్నారు. జిల్లాలో ఎక్కడైనా గంజాయి వంటి ఇతర మాదకద్రవ్యాలను వియ్రించినా, అక్రమ రవాణా చేసినా, వినియోగించినట్లు గుర్తించినట్లైతే వెంటనే టోల్ ఫ్రీ నెంబర్ 1908 లేదా 8712670551నంబర్‌ కు ఫోన్‌ చేసి సమాచారం అందించవలసిందిగా సూచించారు.
ఈ కార్యక్రమంలో మెడికల్ ఆఫీసర్ డా. రవిచంద్ర, కాగజనగర్ టౌన్ సీఐ ప్రేమ్ కుమార్ , ఎస్.ఐ లు సుధాకర్, సురేష్, కళాశాల యాజమాన్యం, విద్యార్థిని విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.
మాదకద్రవ్యాల నిర్మూలన కొరకు జిల్లా వ్యాప్తంగా పోలీసు అధికారులు ఈరోజు నిర్వహించిన కార్యక్రమాలు.
పాఠశాల కళాశాలలో విద్యార్థులకు, వివిధ గ్రామాల్లో ప్రజలకు మాదకద్రవ్యాల వినియోగం వల్ల కలిగే దుష్పభావాలపై ఆయా పోలీస్ స్టేషన్స్ లో సబ్ ఇన్స్పెక్టర్స్, సర్కిల్స్ పరిధిలో సర్కిల్ ఇన్స్పెక్టర్స్, జిల్లావ్యాప్తంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు ఎస్పీ గారు తెలిపారు.
ఆసిఫాబాద్ డివిజన్ లో ఈ రోజు నిర్వహించిన కార్యక్రమాలు
1.ఆసిఫాబాద్ – సెయింట్ జోన్స్ పాఠశాల

  1. వాంకిడి – జెడ్పిహెచ్ఎస్, ఇందాని
  2. కేరామెరి – ఆశ్రమ పాఠశాల, జరీ
  3. జైనూర్ – ప్రభుత్వ జూనియర్ కళాశాల జైనూర్, రాసిమెట్ట, బూసిమెట్ట గ్రామ ప్రజలకు.
  4. సిర్పూర్ యు- పంగిడి బాయ్స్ హాస్టల్, పంగిడి, బాబ్జిపేట్ గ్రామ ప్రజలకు.
  5. లింగాపూర్- ఎంపీయూపీఎస్ మామిడిపల్లి
  6. రెబ్బెన – టి జి ఎస్ డబ్ల్యూ ఆర్ ఎస్ జూనియర్ కాలేజ్
  7. తిర్యాని – ఆశ్రమ పాఠశాల రొంపల్లి

కాగజ్నగర్ డివిజన్లో ఈరోజు అవగాహన కార్యక్రమాలు

  1. కాగజ్ నగర్ టౌన్ – ప్రభుత్వ జూనియర్ కళాశాల కాగజ్నగర్
  2. కాగజ్నగర్ రూరల్ – మైనార్టీ బాయ్స్ రెసిడెన్షియల్ స్కూల్,బలగల
  3. ఇస్ గాం – జెడ్ పి హెచ్ ఎస్ గన్నారం, దుర్గా నగర్, గన్నారం ప్రజలకు.
  4. దహేగాం – జడ్పీహెచ్ఎస్ చిన్న రాస్పల్లి
  5. పెంచికల్పేట్ – కేజీబీవీ
  6. కౌటాల – జెడ్పిహెచ్ఎస్ గుండాయిపేట్
  7. సిర్పూర్ టి- జెడ్పిహెచ్ఎస్ సిర్పూర్ టి, చింతకుంట గ్రామ ప్రజలకు.
  8. చింతల మానేపల్లి – దిందా ప్రాథమిక పాఠశాల, గూడెం, దిందా గ్రామాల ప్రజలకు.
  9. బెజ్జూర్ – ఆశ్రమ పాఠశాల సోమిని పైన తెలిపిన పాఠశాల లేదా కళాశాలలో మాదకద్రవ్యాల దుర్వినియోగం వలన కలిగి నష్టాల గురించి విద్యార్థులకు ఎస్సైలు సీఐల ద్వారా అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. ఎవరైనా చెడు వ్యసనాలకు లేదా డ్రగ్స్ కి అలవాటు పడితే వెంటనే 1908 లేదా 8712670551 నెంబర్ కి సంప్రదించాలని ఎస్పీ గారు తెలిపారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News