పరామర్శించిన కాంగ్రెస్ జిల్లా నాయకులు
నేటి సాక్షి, నారాయణపేట, జూన్ 30,
నారాయణపేట జిల్లా లోని మరికల్ మండల కేంద్రానికి చెందిన ఆర్యవైశ్య సంఘం పూరి బసవరాజ్(97) అనారోగ్యంతో ఆకస్మికంగా మృతి చెందారు. సోమవారం నారాయణపేట జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు సుజేంద్ర శెట్టి,ఎస్. సూర్య మోహన్ రెడ్డి, మండల నాయకులు బసవరాజ్ కుటుంబ సభ్యులను పరామర్శించారు. సూర్య మోహన్ రెడ్డి వెంట గొల్ల కృష్ణయ్య, మరికల్ మండల అధ్యక్షులు బేలగొంది వీరన్న, పట్టణ అధ్యక్షుడు హరీష్ కుమార్, మరికల్ మాజీ ఎంపీటీసీ సీమ గోపాల్, నాయకులు చెన్నయ్య, బొంత మొగులయ్య, రాఘవేంద్ర, రామకృష్ణ, రామకృష్ణారెడ్డి, ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు.





