చెరువుల సుందరీకరణ పనులను పర్యవేక్షించిన ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి
నేటి సాక్షి ప్రతినిధి,మహేశ్వరం(చిక్కిరి.శ్రీకాంత్)
రంగారెడ్డి జిల్లామహేశ్వరం నియోజకవర్గంలోని బడంగ్‌పేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని కురుమల్గూడ గ్రామంలో చెరువు అభివృద్ధి పనులను మహేశ్వరం ఎమ్మెల్యే, సబితా ఇంద్రారెడ్డి పర్యవేక్షించారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, గతంలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ హయాంలో ఈ చెరువు సుందరీకరణకు కోటి రూపాయల నిధులు మంజూరైనట్టు తెలిపారు. ప్రాజెక్ట్‌లో భాగంగా చేపట్టిన పనులను పరిశీలించిన ఎమ్మెల్యే, మిగిలిన పనులు కూడా వేగంగా పూర్తిచేసి ప్రజలకు అందుబాటులోకి తేవాలని కాంట్రాక్టర్‌కు ఆదేశాలు జారీచేశారు. అంతేకాకుండా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ హయాంలో మిషన్ భగీరథ ట్యాంకులు కోట్ల రూపాయలు వేచించి నిర్మించిన ప్రారంభోత్సవానికి నోచుకోని ట్యాంకులు వేసవికాలం పోయి వర్షాకాలం వచ్చినా ట్యాంకులు ప్రారంభించారు ప్రజలకు మంచినీళ్లు అందించారు ఇకనైనా ట్యాంకులు ప్రారంభోత్సవం చేసి ప్రజల దాహార్తి తీర్చాలని రేవంత్ సర్కార్కు సూచించారు.ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ భద్ర ముని రోహిణి రమేష్, టేకుల భాస్కర్ రెడ్డి, పొన్న జంగయ్య, భాస్కర్, కే అశోక్, కీసరి భాస్కర్ రెడ్డి, కరీం, గడ్డం వెంకటరెడ్డి,మర్రి నరసింహారెడ్డి, మర్రి జగన్మోహన్ రెడ్డి, అంకం కుమార్ గౌడ్, కోటగిరి జంగయ్య, పన్నాల కృష్ణారెడ్డి, నరేష్ చారి, తదితరులు పాల్గొన్నారు.





