Tuesday, March 10, 2026

పురుగుమందులు.ఎరువులు. విత్తనాలు.అమ్మకాలలో.

డీలర్లు జాగ్రత్తలు పాటించాలి.

వ్యవసాయాధికారి కే దామోదర్ రెడ్డి.

నేటి సాక్షి, నల్లబెల్లి, జులై0 1: వరంగల్ జిల్లా నల్లబెల్లి మండల కేంద్రంలోని రైతు వేదికలో ఈ ఖరీఫ్
సీజన్లో డీలర్లు తీసుకోవలసిన జాగ్రత్తల పై అవగాహన కార్యక్రమం మండల వ్యవసాయ అధికారి రజిత బన్న. ఆధ్వర్యంలో మంగళవారం నిర్వహించగా మండలంలో ఉన్న 35 మంది డీలర్లు హాజరైనారు. ఈ సమావేశానికి తహసిల్దార్ ముప్పు కృష్ణ. సహాయ వ్యవసాయ సంచాలకులు కే. దామోదర్ రెడ్డి . హాజరై డీలర్లను ఉద్దేశించి వారు మాట్లాడుతూ ఈ ఖరీఫ్ సీజన్లో ఎట్టి పరిస్థితుల్లో రైతులకు ఇబ్బందులు కలగకుండా ఎరువులు ఎమ్మార్పీ ధరలకే విక్రయించాలన్నారు. రైతులకు అమ్మిన ఎరువుల బస్తాల వివరాలు రిజిస్టర్ లో పొందుపరచాలని, రైతుకు ఉన్న వ్యవసాయ భూమికి సరిపడా మాత్రమే విడతల వారీగా పంపిణీ చేయాలని సూచించారు. సీజన్ మొత్తానికి ఒకేసారి కొనుగోలు చేసుకోకుండా అమ్మకం జరిపేటప్పుడు రైతు వేసే పంట వివరాలు తెలుసుకొని ఆ నెలకు సరిపడా మాత్రమే తీసుకునేటట్లుగా ఒప్పించాలన్నారు. నానో యూరియాను, నానో డీ.ఏ.పీ ని వాడే విధంగా రైతులను ప్రోత్సహించాలని, వ్యవసాయ విస్తరణ అధికారులు కూడా గ్రామాల్లో పర్యటిస్తున్న సందర్భంగా ఈ విషయంపై రైతుల అవగాహన కలిగిస్తున్నారని, అందరం కలిసి నానో ఉత్పత్తులను రైతులు వాడే విధంగా చూడాలని కోరారు. గ్రామాల్లో గ్లైఫోసేట్ అక్రమ మార్గాల్లో నిలువచేసిన, అమ్మిన అట్టి సమాచారాన్ని వెంటనే వ్యవసాయ అధికారులకు అందజేసినట్లయితే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. డీలర్లు ఎవరు కూడా అనుమతి లేకుండా గ్లైఫోసేట్ కొనడం గాని అమ్మడం గాని చేయకూడదని హెచ్చరించారు. డీలర్లు ఎప్పటికప్పుడు తన దగ్గర ఉన్న పురుగుమందుల స్టాకులను పరిశీలిస్తూ డేట్ ఎక్స్పైర్ అయినా స్టాక్ లను వెంటనే వేరు చేసి ప్రత్యేకమైన బాక్సులో వాటిని ఉంచి అట్టి బాక్సు పై డేట్ ఎక్స్చైర్ స్టాక్ అని రాసి రోజు అమ్మే స్టాక్ కు దూరంగా పెట్టాలని, అట్టి స్టాకు వివరాలను డేట్ ఎక్స్చైర్ స్టాక్ రిజిస్టర్ లో నమోదు చేసి వ్యవసాయ అధికారి తో సర్టిఫై చేయించుకోవాలని ఆదేశించారు. మండల తహసిల్దార్ ముప్పుకృష్ణ మాట్లాడుతూ డీలర్లు జిల్లా అధికారుల ఆదేశానుసారం నడుచుకోవాలని, రైతులకు ఇబ్బందులు కలగకుండా ఎరువుల అమ్మకాలు చేయాలని, ఈ సీజన్లో వ్యవసాయ శాఖ అధికారులతో పాటు తనిఖీలు చేపడతామని అక్రమాలకు పాల్పడినట్లు తమ దృష్టికి వస్తే చట్టప్రకారం చర్యలుఉంటాయన్నారు.కార్యక్రమంలో,డీలర్లు, వ్యవసాయ విస్తరణ అధికారులు పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News