నేటి సాక్షి, దేవరకద్ర
జులై 1
హైదరాబాద్ లోని ఓ ఆర్ ఆర్ ఎగ్జిట్ నెంబర్ 12 వేదా కన్వెన్షన్ హాల్ లో మంగళవారం జరిగిన బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్ర రావు ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమానికి బిజెపి మహబూబ్ నగర్ జిల్లా కార్యదర్శి దేవరకద్ర మండలం పెద్ద గోపులాపూర్ కొత్త కాపు నారాయణరెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా పార్టీ అధ్యక్షుడు రామచంద్రరావును నారాయణరెడ్డి ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో బిజెపి జిల్లా పార్టీ అధ్యక్షుడు శ్రీనివాస్ రెడ్డి, కోశాధికారి పాండురంగారెడ్డి లతో పాటు జిల్లా పదాధికారులు, పార్టీ ముఖ్య నాయకులు తదితరులు పాల్గొన్నారు.