నేటి సాక్షి ఉమ్మడి వరంగల్
(సందెల రాజు)
వరంగల్ పోలీస్ కమిషనరేట్ డ్రగ్ కంట్రోల్ టీం అందిన సమాచారం మేరకు మంగళవారం పోలీసులు స్థానిక డ్రగ్ అధికారి కిరణ్ తో రంగశాయి పేట లోని ఆయుష్ మందుల షాపులో విస్తృతమైన తనిఖీలు చేయగా మత్తు కలిగించే ప్రభుత్వ నిషేధిత దగ్గు మందులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా పోలీసులు పెద్ద ఎత్తున నిషేధిత దగ్గు మందులను స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేసారు. ఈ తనిఖీల్లో ఆర్. ఐ శివ కేశవులు, ఆర్. ఎస్. ఐ మనోజ్, పూర్ణ, నాగరాజు తో యాంటీ డ్రగ్స్ కంట్రోల్ వింగ్ సిబ్బంది పాల్గొన్నారు.





