Tuesday, March 10, 2026

ఉచిత నేత్ర వైద్య శిబిరాలను ప్రజల సద్వినియం చేసుకోవాలి


నేటి సాక్షి-హుజురాబాద్:
జయన్న పౌండేషన్ ఆధ్వర్యంలో హుజరాబాద్ మండలంలో ఈనెల 3 నుండి 7వ తేదీ వరకు నిర్వహిస్తున్న ఉచిత కంటి వైద్య శిబిరాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని జయన్న ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు గుడిపాటి సరిత జైపాల్ రెడ్డి తెలిపారు. గురువారం ఆయన ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. హుజురాబాద్ ప్రాంతంలోని నిరుపేదలకు ఎలాంటి నేత్ర సమస్యలు ఉన్న బాగు చేయాలని సదుద్దేశంతో శంకర కంటి ఆసుపత్రి జిల్లా అందత్వ నివారణ సంస్థ జయన్న ఫౌండేషన్ సంయుక్త ఆధ్వర్యంలో ఉచిత నేత్ర వైద్య శిబిరాలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ నెల 3వ తేది గురువారం జూపాక, 4వ తేది శుక్రవారం సిర్సపల్లిలో, 5వ తేది శనివారం పోతిరెడ్డి పేటలో, 7వ తేది సోమవారం చెల్పూర్ లో ఉచిత నేత్ర వైద్య శిబిరాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. నేత్ర సమస్యలున్న వారు తమ ఆధార్ కార్డు తీసుకొని రావాలని, పరీక్షలు నిర్వహించి మందులు ఉచితంగా అందిస్తామని, అవసరమైన వారికి శంకర కంటి ఆసుపత్రిలో ఉచితంగా శస్త్ర చికిత్సలు నిర్వహిస్తామన్నారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సందర్భంగా కోరారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News