-మహబూబ్ నగర్ జిల్లా డిసిసి అధ్యక్షుడు,దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి ఆరోపణ..
నేటి సాక్షి, దేవరకద్ర జులై 7
హైదరాబాద్ లోని సిగాచి ప్రమాదంలో 42 మంది చనిపోతే ఓ ప్రతిపక్ష నేతగా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కనీసం బాధిత కుటుంబాలకు సానుభూతి కూడా తెలపలేదని మహబూబ్ నగర్ జిల్లా డిసిసి అధ్యక్షుడు, దేవరకద్ర నియోజకవర్గ ఎమ్మెల్యే జి.మధుసూదన్ రెడ్డి (జిఎంఆర్) ఆరోపించారు.
హైదరాబాద్ సీఎల్పీ కార్యాలయంలో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో దేవరకద్ర ఎమ్మెల్యే జి. మధుసూదన్ రెడ్డి మాట్లాడారు.కన్నెపల్లి, కల్వకుర్తి పంప్ హౌస్ లు మీరు ఓపెన్ చేస్తారా.? మేము ఓపెన్ చేయాలా అని హరీష్ రావు మాట్లాడడం తగదన్నారు.మీరు కన్నెపల్లి, కల్వకుర్తి దగ్గరకు వస్తే ప్రజలు తగిన బుద్ధి చెబుతారన్నారు.
కల్వకుర్తి పంపులు ప్రతి ఏడాది జులై చివరిలో లేదా ఆగస్ట్ ఒకటో తేదీన స్విచాన్ చేసి వానాకాలం పంటలకు నీళ్లు అందిస్తారు, ఈసారి కూడా అదే విధానం అమలవుతుందన్నారు.
కల్వకుర్తి నుంచి ఎప్పుడు నీళ్లు లిఫ్ట్ చెయ్యాలో…మాకు తెలుసన్నారు.కాళేశ్వరం ప్రాజెక్టు డిజైన్ చేసిన ప్రకారం మేడిగడ్డ దగ్గర కన్నెపల్లి పంప్ హౌజ్ నుంచి నీటిని లిఫ్ట్ చేసి తర్వాత అన్నారం, సుందిళ్లకు నీటిని ఎత్తిపోయాలన్నారు.
ఆ మూడు బ్యారేజీలను తప్పుడు సాంకేతిక టెక్నాలజీతో గత ప్రభుత్వం నిర్మించిందని, ఈ బ్యారేజీలు ప్రమాదకరంగా ఉన్నాయని ఎన్‌డీఎస్ఏ హెచ్చరిచ్చిందని ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి అన్నారు.కుంగిన మేడిగడ్డ కన్నేపల్లి నుండి నీళ్లు లిఫ్ట్ చేయడం రాదని తెలిసి, రైతులను మభ్యపెట్టి, మోసం చేయాలని కుట్రలకు హరీష్ రావు పాల్పడుతున్నారని ఆయన విమర్శించారు.
బీఆర్‌ఎస్ ప్రభుత్వ అసమర్థత, నిర్లక్ష్యం, నిర్వాకం కారణంగానే మేడిగడ్డ బ్యారేజీ కుంగిపోయింది, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలు కూడా ఇప్పటికీ ప్రమాదకర పరిస్థితిలోనే ఉన్నాయన్నారు.
మేడిగడ్డలో నీళ్లు స్టోరేజ్ చేస్తే కూలిపోతది అని ఎన్ డి ఎస్ ఏ చెప్పింది, ఎన్ డి ఎస్ ఏ ను మేము అనుసరి స్తున్నామన్నారు.కృష్ణా జలాలను ఏపీ అక్రమంగా తరలించటం వెనుక అప్పటి బీఆర్‌ఎస్ ప్రభుత్వం చేసిన కుట్రలన్నీ ఇప్పటికే బయటపడ్డాయి అన్నారు.బీఆర్ఎస్ ప్రభుత్వ హయంలోనే పోతిరెడ్డిపాడు కెపాసిటీ ఏపీ ప్రభుత్వం రెండింతలకు మించి 88వేల క్యూసెక్కులకు పెంచుకున్నది, రాయలసీమ లిఫ్ట్ స్కీమ్, ముచ్చుమర్రి నుంచి రోజుకు దాదాపు ఎనిమిది నుంచి పది టీఎంసీల నీటిని ఏపీ మళ్లించుకుంటుంటే.. బీఆర్‌ఎస్ చోద్యం చూస్తూ, దొంగచాటుగా సహకరించిందని ఆరోపించారు.
నాడు మీ పాలన లో జగన్ ఆంధ్రప్రదేశ్ ముచ్చుమర్రి దగ్గర పెద్ద గండి పెట్టి మొత్తంగా 12 టీఎంసీల నీళ్లు తీసుకెళ్తే బీఆర్ఎస్ మౌనం వహించారన్నారు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో 2004 నుంచి 2014 వరకు ఏపీ అక్రమంగా 770 టీఎంసీలు కృష్ణా జలాలు తీసుకపోగా, 2014 నుంచి 2023 వరకు బీఆర్‌ఎస్ పాలనలో ఏపీ ప్రభుత్వం ఏకంగా 1,225 టీఎంసీల నీళ్లు అక్రమంగా తీసుకుపోయినట్లు రికార్డులు ఉన్నాయన్నారు.
బి ఆర్ ఎస్ చేసిన తప్పిదాల వల్ల ఆంధ్రప్రదేశ్ కృష్ణా నది నీళ్లు అప్పనంగా తీసుకెళ్లిందని ఆరోపించారు.నాడు
బి ఆర్ ఎస్ పాలన లో తెలంగాణ ప్రయోజనాలను ఎలా తాకట్టుపెట్టారో, తెలంగాణ ను ఎలా మోసం చేశారో.. ఈ గణాంకాలే తెలియజేస్తున్నాయని అన్నారు. బి ఆర్ ఎస్ చేసిన దోపిడీ వలన తెలంగాణ 100 ఏళ్ళు వెనక్కి పోయిందని ఆవేదన వ్యక్తపరిచారు.ఫోన్ ట్యాపింగ్ చేయించి, వ్యక్తుల వ్యతిగత స్వేచ్ఛకు భంగం కలిగించిన వ్యక్తి, తెలంగాణ బాపు ఎలా అయితాడని ఎద్దేవా చేశారు.కాళేశ్వరం ప్రాజెక్టు లక్ష కోట్ల అవినీతి లో ప్రధాన కారకుడు కేసీఆర్ అని ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి ఆరోపించారు.
అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఫోన్ ట్యాపింగ్ లు చేసి,బీఆర్ఎస్ నాయకులు అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని విమర్శించారు.
వాళ్ళు చేసిన అవినీతిపై విచారణ జరుగుతుంటే, బనకచర్ల ఇష్యూను ముందుకు పెట్టి, సమస్య ను పక్క దారి పట్టిస్తున్నారన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి,మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పోరాటం చేస్తే బనకచర్ల ను తాత్కాలికంగా కేంద్రం ఆపిందని ఆయన గుర్తు చేశారు.గోదావరి లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చేపడుతున్న బనకచర్ల కు ప్రధాన కారణం బిఆర్ఎస్ పార్టీ అని ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి ఆరోపించారు.
రైతులను ఏవిధంగా ఆదుకోవాలో, వాళ్లకు ఎరువులు ఎప్పుడు ఇవ్వాలో రైతు కుటుంబాల నుండి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వానికి బాగా తెలుసు అన్నారు.
కాంగ్రెస్ పాలనలో రైతులు బాగుంటే బిఆర్‌ఎస్ నేతలు ఓర్వ లేకపోతున్నారన్నారు.
గత ఏడాది వానాకాలంతో పాటు ఇటీవల యాసంగి సీజన్‌లో భారతదేశ చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా రాష్ట్ర రైతాంగం రికార్డు స్థాయిలో వరి పంట సాగు చేసిన విషయాన్ని పక్కదారి పట్టించి, హరీష్‌రావు తప్పుడు మాటలు మాట్లాడుతున్నారని ఆరోపించారు.
కాళేశ్వరం కూలి పనికిరాకుండా పోయిన…గత వానాకాలంలో రాష్ట్రంలోని రైతులు 66.7 లక్షల ఎకరాల్లో వరి పంట సాగు చేసి 153.5 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం పండించారన్నారు.
యాసంగిలో 60 లక్షల ఎకరాల్లో వరి సాగు చేస్తే 130 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వచ్చిందన్నారు.
అబద్ధాలను గోబెల్స్‌కు మించి ప్రచారం చేయటం మాజీ మంత్రి హరీష్‌రావు అలవాటయింది, అబద్దాలకు కేరాఫ్ అడ్రస్ హరీష్ రావు అని ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి విమర్శించారు.





