నేటి సాక్షి మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా
జూలై 13
ఓల్డ్ రామంతాపూర్ జరిగిన డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ సేవా సంఘం నూతన కమిటీ ప్రమాణ స్వీకారోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరైన ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి ఈ సందర్భగా ఆయన మాట్లాడుతూ నూతన కమిటీ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు.
తన దృష్టికి వచ్చిన మాదిగ సమస్యల పరిష్కారానికి తప్పకుండా కృషి చేస్తానని హామీ ఇచ్చారు.లైబ్రరీ ఏర్పాటు చేస్తా అని డ్రైనేజీ సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఈ కార్యక్రమంలో బి ఆర్ ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు గంధం నాగేశ్వర్ రావు బోసాని పవన్, సూరం శంకర్, ముత్యాల నరహింహా, అధ్యక్షుడు ఆనంద్, నర్సింహా, భరత్, అశోక్ అరుణ్ తదితరులు పాల్గొన్నారు.