నేటి సాక్షి ప్రతినిధి …. ఆగస్టు 31 ..రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గం బాలాపూర్ మండలంలోని బడంగ్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని బడంగ్పేట్ గ్రామంలో గణపతి ఉత్సవాల సందర్భంగా అన్నా యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రాళ్లగూడెం బాలకృష్ణారెడ్డి గొప్ప దైవకార్యమైన అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.ఈ పుణ్యకార్యానికి ముఖ్య అతిథులుగా మహేశ్వరం నియోజకవర్గం కంటెస్టెడ్ ఎమ్మెల్యే అందెల శ్రీరాములు యాదవ్ , బడంగ్పేట్ మాజీ సర్పంచ్ నిర్మల నరసింహారెడ్డి మాజీ కార్పొరేటర్ బంగారు అనిత ప్రభాకర్ అలాగే బడంగ్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు రాళ్లగూడెం రామకృష్ణారెడ్డి పాల్గొని కార్యక్రమాన్ని మరింత విశిష్టంగా మార్చారు.
ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ అన్ని దానాల కన్నా అన్నదానం చాలా గొప్పదని
గణపతి ఉత్సవాలలో అన్నదానం దైవకార్యమని,సమాజానికి సేవ చేయడమే నిజమైన పండుగని, యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగే ఇటువంటి కార్యక్రమాలు ప్రజలకు ఆధ్యాత్మిక ఆనందం కలిగిస్తాయని ప్రశంసించారు.రాళ్లగూడెం బాలకృష్ణారెడ్డి ని అభినందిస్తూ ఇలాంటి సేవా కార్యక్రమాలు మరిన్ని చేయాలని అందెల శ్రీరాములు యాదవ్ , నిర్మల నరసింహారెడ్డి ఆకాంక్ష వ్యక్తం చేశారు.ఈ అన్నదాన కార్యక్రమం వల్ల స్థానిక ప్రజలు భక్తి భావంతో, ఆనందంతో పాల్గొని గణపతి బప్ప మోరియా నినాదాలతో కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.
అన్నదానం అనే దైవకార్యం ద్వారా బడంగ్పేట్‌లో భక్తి, సేవా భావం మరింత వెలుగులు నింపింది. ఈ యొక్క కార్యక్రమంలో అన్న యూత్ అసోసియేషన్ శాశ్వత అధ్యక్షులు రాళ్ల గూడెం రాజ వర్ధన్ రెడ్డి ఆశం గారి శ్రీనివాస్ రెడ్డి రేసు నరసింహారెడ్డి తీగల సురేందర్ రెడ్డి మోర మహేందర్ దేశపాక జగన్ తీగల రాకేష్ రెడ్డి రాళ్ల గూడెం శ్రీకాంత్ రెడ్డి తీగల రాఘవేంద్ర రెడ్డి రాళ్ల గూడెం శ్రీకృష్ణారెడ్డి సంగా ఉదయ్ కుమార్ మోర అశోక పాశం శివ తదితరులు పాల్గొన్నారు





