Thursday, March 12, 2026

కక్షపూరిత రాజకీయాలకు దూరంగా గువ్వల రమేష్ రెడ్డి

నేటి సాక్షి న్యూస్ చౌడేపల్లి
కక్షపూరిత రాజకీయాలకు దూరంగా గువ్వల రమేష్ రెడ్డి ప్రవర్తన ఉందని పలువురు అంటున్నారు కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి ఎలాంటి చర్యలకు పాల్పడకుండా ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ఆయన పనిచేస్తున్నాడని పరిశీలకులు భావిస్తున్నారు ఈ క్రమంలో చౌడేపల్లి పట్టణంలోని నడిబడ్డున ఉన్న దివంగత ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డి విగ్రహాన్ని తొలగించకపోవడమే గువ్వల రమేష్ రెడ్డి తత్వమని పలువురు అంటున్నారు గత వైసిపి హయాంలో దివంగత నూతన కాలువ రామకృష్ణారెడ్డి విగ్రహం వద్ద ఉన్న తెలుగుదేశం జెండాను వైకాపా నాయకులు తొలగించారు అప్పట్లో మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు అయినటువంటి గువ్వల రమేష్ రెడ్డి ఈ విషయమై అరెస్టు సైతం అయ్యారు అయితే ప్రస్తుతం జరుగుతున్న కాలువ పనుల్లో వైయస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహం తొలగించకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేశారు దగ్గరుండి పనులను పరిశీలించారు అప్పట్లో గువ్వల రమేష్ రెడ్డి పై అక్రమంగా కేసులు బనాయించి తెలుగుదేశం జెండాను తొలగించారు అయితే కాలువ పనుల నేపథ్యంలో వైయస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహం తొలగించలేదు కాబట్టి తెదేపా మండల అధ్యక్షుడు గువ్వల రమేష్ రెడ్డికి వైసీపీ నాయకులకు మధ్య తేడా ఇదేనని బస్టాండ్ లో చర్చించుకుంటున్నారు అంతేకాకుండా కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ప్రభుత్వ సంక్షేమ ఫలాలు ప్రజల్లోకి తీసుకెళ్లడమే ధ్యేయంగా పనిచేస్తూ ముందుకెళుతున్న గువ్వల రమేష్ రెడ్డి సమకాలిన రాజకీయాలకు ఆదర్శప్రాయుడని పరిశీలకులు కొనియాడుతున్నారు

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News