Thursday, March 12, 2026

చలో బస్ భవన్ కి తరలిన బీఆర్ఎస్ నేతలు అరెస్ట్

సాక్షి, బెజ్జంకి:ఆర్టీసీ బస్ ఛార్జీల పెంపును వ్యతిరేకిస్తూ బుధవారం బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన “చలో బస్ భవన్” కార్యక్రమానికి వెళ్తున్న బెజ్జంకి మండల బీఆర్ఎస్ నేతలను పోలీసులు ముందస్తుగా అరెస్ట్ చేసి స్టేషన్‌కు తరలించారు.ఉచిత బస్ పథకం పేరుతో ఆర్టీసీని నష్టాల్లోకి నెట్టిన ప్రభుత్వంపై నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళలకు ఉచిత ప్రయాణం కల్పించి, పురుషులకు రెట్టింపు వసూళ్లు చేయడం వల్ల కుటుంబాలపై ఆర్థిక భారం పడుతోందని తెలిపారు. అలాగే బస్ పాస్ ధరలు 25 శాతం పెంచడాన్ని, ఎల్ అండ్ టీ మెట్రో ప్రైవేటీకరణ చర్యలను నేతలు తీవ్రంగా ఖండించారు.ప్రజా సమస్యలపై నిరంతరం పోరాడుతున్న కేటీఆర్, హరీష్ రావులను అరెస్ట్ చేయడం అన్యాయం అని పేర్కొన్నారు. ప్రజలే ఈ ప్రభుత్వానికి సమాధానం చెబుతారని నేతలు అన్నారు.అరెస్ట్ అయిన వారిలో బీఆర్ఎస్ మండల అధ్యక్షులు పాకాల మహిపాల్ రెడ్డి, సీనియర్ నాయకులు లింగాల లక్ష్మణ్, పాక్స్ వైస్ చైర్మన్ బండి రమేష్, పట్టణ అధ్యక్షులు వంగల నరేష్, కల్లూరి అజయ్ యాదవ్, పొట్లపల్లి శివకృష్ణ తదితరులు ఉన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News