-( నేటి సాక్షి ప్రతినిధి మహేశ్వరం అక్టోబర్ 9:)* రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గం కందుకూరు మండల కేంద్రంలోని ఆకుల మైలారంలో కేఎల్ఆర్ మాట్లాడుతూ..విధి నిర్వాహణలో ఉన్న యాచారం సీనియర్ రిపోర్టర్ కాలె పెంటయ్య ఇటీవల యాక్సిడెంట్ లో గాయపడ్డారు. కాంగ్రెస్ శ్రేణుల ద్వారా విషయం తెలుసుకున్న కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డి…. కందుకూరు మండలం ఆకులమైలారం గ్రామంలో రిపోర్టర్ ఇంటికి వెళ్లి పరామర్శించారు. ఆయన కుటుంబానికి భరోసా ఇచ్చిన కిచ్చెన్నగారు.. కాలె పెంటయ్య పూర్తి ఆరోగ్యంగా కోలుకునే వరకు అండగా ఉంటానని హామీ ఇచ్చారు.కాంగ్రెస్ శ్రేణులతో కలిసి కొంత ఆర్థిక సహాయం అందించిన లక్ష్మారెడ్డి… ఆరోగ్య పరిస్థితిని వాకాబు చేశారు. కుటుంబానికి అండగా ఉండాలని కందుకూరు మండలం ఆకులమైలారం నాయకులకు కేఎల్ఆర్ సూచించారు.రిపోర్టర్ పెంటయ్యను పరామర్శించిన వారిలో మహేశ్వరం నియోజకవర్గం కాంగ్రెస్ నాయకులు, వివిధ విభాగాల నేతలు ఉన్నారు.





