నేటిసాక్షి, మిర్యాలగూడ : భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు సీజే పై దాడి ప్రజాస్వామ్యం పైన జరిగిన దాడిగా పరిగణించాలని జన విజ్ఞాన వేదిక జాతీయ కన్వీనర్ డాక్టర్ మువ్వా రామారావు అన్నారు. పట్టణంలోని బిసి జ్యోతిబాపూలే భవన్ లో కస్తూరి ప్రభాకర్ అధ్యక్షతన గురువారం రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా జన విజ్ఞాన వేదిక జాతీయ కన్వీనర్ డాక్టర్ మువ్వా రామారావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, దేశ చరిత్రలో అక్టోబర్ 6న జరిగిన దాడి చీకటి రోజుగా మిగిలిపోతుందని, ఒక భారత ప్రధాన న్యాయమూర్తి పై కోర్టులో దాడి జరిగితే, సామాన్య మానవుని పరిస్థితి ఏమిటో ప్రతి ఒక్కరు అర్థం చేసుకోవాలని అన్నారు. అనంతరం విద్యా వికాస వేదిక కన్వీనర్ కస్తూరి ప్రభాకర్ మాట్లాడుతూ, అత్యున్నత న్యాయ స్థానంలో సీజే పై దాడి సరైంది కాదని, విద్యావంతుల వేదిక తెలంగాణ అధ్యక్షులు అంబటి నాగయ్య మాట్లాడుతూ, వందేళ్ళ సనాతన ధర్మం పేరుతో సీజే పై దాడి భారత ప్రజాస్వామ్యాన్ని అపహస్యం చేసినట్లు అయిందని అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రజా సంఘాల ఐక్యవేదిక నాయకులు బీసం రామయ్య, భారత్ బచావో జిల్లా అధ్యక్షురాలు ఉదయ, కెవిపిఎస్ నాయకులు పరశురాములు, జెవివి జిల్లా అధ్యక్షులు సుదర్శన్ రెడ్డి, డా.రాజు, కందుకూరి సుదర్శన్, రావినాయక్, హరికృష్ణ, తరి యల్లయ్య, ఎంసీపిఐ నాయకులు పి.కాశి కిరణ్మయి, దశరథ నాయక్, రాజారత్నం, కోల సైదులు, స్వామి, మోహన్ రావ్, వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.





