నేటి సాక్షి న్యూస్ చౌడేపల్లిసమకాలిన రాజకీయాలకు రాష్ట్ర మాజీ మంత్రి పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆదర్శప్రాయుడని రాష్ట్ర వైసీపీ ప్రధాన కార్యదర్శి పెద్దిరెడ్డి అన్నారు శనివారం మాజీ మంత్రి పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి 75వ జన్మదిన వేడుకలను స్థానిక బస్టాండ్లో ఘనంగా నిర్వహించారు సర్పంచ్ శ్రీరామ్ భరత్ వరుణ్ శెట్టి పవన్ రాయల్ హరీష్ రాయల్ కళ్యాణ్ భరత్ రామ్ కి మంజునాథ నున్న భాస్కర ల ఆధ్వర్యంలో అన్నదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా వచ్చిన వైఎస్ఆర్సిపి రాష్ట్ర ముఖ్య కార్యదర్శి పెద్దిరెడ్డి ప్రసంగిస్తూ పుంగనూరు నియోజకవర్గంలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అడుగు పెట్టినప్పటి నుంచి అనేక అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయని గుర్తు చేశారు సిమెంట్ రోడ్లు గ్రామ గ్రామానికి రహదారులు పేదలకు పక్కా గృహాలు మంచినీటి సమస్య తీర్చే గా అనేక చర్యలు చేసినట్లు ఆయన వివరించారు అక్రమంగా మిథున్ రెడ్డిని లిక్కర్ కేసులో ఇరికించారని అయితే ఇటీవల మొలకలచెరువులో నకిలీ మద్యం తయారు చేసే కేంద్రాన్ని పట్టుకోవడం అందరికీ తెలుసు అన్నారు ప్రజల ఆరోగ్యాన్ని చెడగొట్టే నకిలీ మద్యం తయారు చేస్తున్నప్పటికీ చూసి చూడనట్లు రాష్ట్ర మంత్రి రాంప్రసాద్ రెడ్డి వ్యవహరించడం పట్ల సర్వత్ర నిరసనలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయన్నారు నకిలీ మద్యం తయారీదారుల నుంచి ముడుపులు తీసుకున్నట్లుగా అందరిలో అనుమానం ఉందన్నారు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ లో ఇందుకు సమాధానం చెప్పాలని ప్రశ్నించారు మాజీ ముఖ్యమంత్రి మరల వైయస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవుతారని మాజీ మంత్రి పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపడతారని ఆశాభావాన్ని వ్యక్తం చేశారు అదే విధంగా కొలింపల్లి క్రాస్ లో మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నాగభూషణ్ రెడ్డి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి జన్మదినం సందర్భంగా భారీ కేక్ ను కట్ చేసి అందరికీ పంచబెట్టారు ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీలు అంజిబాబు రుక్మిణమ్మ జంగాలపల్లి రమణ కొత్తకోట షఫీ మిద్దింటి శంకరనారాయణ నరసింహులు యాదవ్ బ్యాంకు రెడ్డప్ప వెంకటరెడ్డి శ్రీరాములు అల్తాఫ్ కృష్ణారెడ్డి సుబ్రమణ్యం రాజు పుంగనూరు నియోజకవర్గ ఎస్టీ మహిళా సంఘం అధ్యక్షురాలు అనుప్రియ యశోద మండలంలోని వైసిపి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు





