నేటి సాక్షి తిరుపతి *రామచంద్రాపురం*కమ్మ కండ్రిగ చేకూరి నాగమ నాయుడు ఎర్రమ్మల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు కె సునీతకు ఆ పాఠశాల ఉపాధ్యాయ బృందం దుశ్శాలువ కప్పి,పండ్లు, పుష్పగుచ్చాన్ని అందజేసి ఘనంగా సన్మానించి ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు కె సునీత మాట్లాడుతూ పదవ తరగతి వందరోజుల యాక్షన్ ప్రణాళికను పకడ్బందీగా నిర్వహించి మెరుగైన ఫలితాలు సాధనకు కృషి చేసి మన పాఠశాలను ప్రథమ స్థానంలో నిలపాలని ఉపాధ్యాయులకు ఆకాంక్షించారు. అదేవిధంగా మిగతా తరగతి విద్యార్థిని, విద్యార్థులపై చదువుతోపాటు క్రమశిక్షణ అలవర్చాలని ప్రైవేట్ పాఠశాలల కంటే మెరుగైన విద్యను అందించాలని ఉపాధ్యాయులను కోరారు అనంతరం ప్రేయర్ సమయంలో ప్రధానోపాధ్యారాలుతో కలిసి ఉపాధ్యాయులు విద్యార్థినీ విద్యార్థులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు ఈ కార్యక్రమంలో ఎస్ ఎల్ టి ఏ జిల్లా అధ్యక్షులు దొడ్డ ఉమామహేశ్వర్,విశ్వనాథం హిమబిందు,ఐ.వెంకటరామయ్య, బ్రహ్మం, కృష్ణార్జున రెడ్డి, దిలీప్ కుమార్, కోటేశ్వర బాబు,శ్రీరాములు, శాంతి, భార్గవి,మునిరాజ ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

