నేటి సాక్షి,నారాయణపేట, జనవరి,4,( రిపోర్టర్ ఇమామ్ సాబ్ ), నారాయణపేట జిల్లాలోని లోని ధన్వాడ మండల పరిధిలో వివిధ గ్రామాలకు రైతులు వ్యవసాయం చేసుకునేందుకు కోయిల్ సాగర్ ప్రాజెక్ట్ రైట్ కెనాల్ ద్వారా సాగునీరు విడుదల కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా దేవరకద్ర ఎమ్మెల్యే (జిఎంఆర్) మధుసూదన్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కోయిల్ సాగర్ ప్రాజెక్టు రైట్ కెనాల్ ద్వారా సాగునీరు విడుదల చేయడం పట్ల ధన్వాడ మండలంలోని వివిధ గ్రామాల సర్పంచులు, రైతన్నలు, ప్రభుత్వ పనితీరుపై హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ సాగునీరును రైతులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు ఉమామహేశ్వర్ రెడ్డి, జనార్దన్ రెడ్డి, కొండ్రంపల్లి గ్రామ సర్పంచ్ సుధాకర్ , ఉప సర్పంచ్ ఆంజనేయులు, వివిధ, గ్రామాల నుంచి హాజరైన సర్పంచులు ఇరిగేషన్ అధికారులు తదితర రైతులు పాల్గొన్నారు.

