నేటి సాక్షి,నారాయణపేట, జనవరి 6,( రిపోర్టర్ ఇమామ్ సాబ్ ), నారాయణపేట జిల్లాలోని మరికల్ మండల పరిధిలోని తీలేరు గ్రామంలో కన్న తండ్రి కన్న బిడ్డలను చంపి కోయిల్ సాగర్ కాల్వలో పడవేసిన సంఘటన మంగళవారం నాడు తెల్లవారుజామున నారాయణపేట జిల్లాలోని తీలేరు గ్రామంలో చోటుచేసుకుంది. మరికల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ రాజేందర్ రెడ్డి, ఎస్సై రాములు కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. తీలేరు గ్రామానికి చెందిన శివరాం అనే వ్యక్తి తన భార్య కాపురానికి రాలేదని మనస్థాపానికి గురైన తనకున్న ఇద్దరు పిల్లలు రిత్విక(9), చైతన్య(6) లను మంగళవారం నాడు తెల్లవారుజామున తండ్రి శివరాం చంపి కోయిల్ సాగర్ కాల్వలో పడవేయడం జరిగింది…. తండ్రి శివరాం గుళికల మందు తాగి ఆత్మహత్య ప్రయత్నానికి ప్రయత్నించాడు. గ్రామస్తులు మరికల్ పోలీసులకు సమాచారం అందించడం జరిగిందన్నారు. కోయిల్ సాగర్ కాల్వలో పడి ఉన్న చిన్నారుల మృతదేహాలను బయటకు తీయడం జరిగిందన్నారు. తండ్రి శివరాం గుళికల మందులు తాగడంతో పరిస్థితి విషమించడంతో చికిత్స నిమిత్తం మహబూబ్నగర్ ప్రభుత్వ ఆసుపత్రికి108లో తరలించినట్లు ఎస్సై వివరించారు. ఈ సంఘటనతో తీలేరు గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

