నేటి సాక్షి వికారాబాద్:బలమైన గ్రామాలు – అభివృధి చెందిన భారత్ మోదీ గారి లక్ష్యంఈ మార్పులవల్ల కూలీలకు, రైతులకు ఎక్కువ పని, మెరుగైన వేతనం, గౌరవప్రదమైన జీవనం లభిస్తుంది.ఏ నామ్ దార్ నహీ…! కామ్ దార్ హై…!!ఈ బిల్లులో అనూహ్యమైన ప్రయోజకమైన మార్పులు చోటుచేసుకున్నాయి – పని దినాల పెంపు 125 రోజులు – కనీస వేతనం రోజుకి 240 గా పెంపు- రైతులకు లబ్దిదాయకంగా కూలీల కొరతలేకుండా విధివిధానాలు- స్కిల్ డెవలప్మెంట్- బయోమెట్రిక్ హాజరు, జియో ట్యాపింగ్ ద్వారా పని జరిగే ప్రదేశం తెలిపే విధానం, జవాబుదారీతనంప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రతిపాదించిన వికసిత్ భారత 2047 లక్ష్యాన్ని సాధించే దిశగా ఈ చట్టం కీలక పాత్ర పోషిస్తుంది, సంక్షేమం పై ఆధారపడే స్థితినుండి స్వావలంబన వైపు నడిపించే విధంగా ఇది రూపుదిద్దుకుంటోంది, ఉపాధి హామీ పథకం పనుల ఎజెండా లో 50% గ్రామ పంచాయతీ తీర్మానం మేరకు పనులు ఎంపిక చేయాలనీ కేంద్ర సర్కార్ ఈ పథకంలో కొత్తగా అనేక సంస్కరణలు తీసుకువచ్చింది గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి పెరుగుతుంది తద్వారా పట్టణానికి వలసలు తగ్గుతాయి ప్రభుత్వ నిధులను అనుత్పాదకత వైపు అడ్డగోలుగా నీళ్ళలా నిధులను ఖర్చుపెట్టకుండా చేసిన సవరణలతో అనామత్ గాళ్ళకు ఆయాసం వస్తోందిఈ జీవోతో ఎవరికి ఇబ్బంది లేదని ప్రతిపక్షాలకు ఎందుకు అంత ఆయాసం అవుతుందని, ఈ ధోరణి వారి అభద్రత భావానికి, అసహనానికి నిదర్శనం.

