*నేటి సాక్షి, జగిత్యాల ప్రతినిధి:* ( గుండ ప్రశాంత్ గౌడ్ )జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలం లోతునూర్ తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న ఇందిరమ్మ చీరల పంపిణీ పథకం కింద శుక్రవారం రోజున లోత్తునూర్ గ్రామపంచాయతీ కార్యాలయం ఆవరణలో గ్రామ సర్పంచ్ ఆకుల సుమన్ గౌడ్ ఆధ్వర్యంలో మహిళా సంఘాల్లో లేని ప్రతి మహిళతో సహా 18 ఏళ్లు నిండిన అర్హులైన మహిళలందరికీ నాణ్యమైన చీరలు పంపిణీ చేయడం జరిగింది ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ ఆకుల సుమన్ గౌడ్ మాట్లాడుతూ ఈ పథకం మహిళల గౌరవం సాధికారతను పెంచే లక్ష్యంతో అమలు చేయబడుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ ఒరగంటి మల్లేశం,వార్డు సభ్యులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు,పంచాయతీ కార్యదర్శి,మహిళలు పాల్గొన్నారు

