నేటి సాక్షి,నారాయణపేట, జనవరి 18, ( రిపోర్టర్ ఇమామ్ సాబ్ ), నారాయణపేట జిల్లాలోని మరికల్ మండల కేంద్రంలోని యువకుమండలి ఆధ్వర్యంలో నిర్వహించిన స్వామి వివేకానంద 163 వ యువజన వారోత్సవాల్లో భాగంగా వాలీబాల్, క్రికెట్ కబడి పోటీలలో గెలుపొందిన క్రీడాకారులకు ఆదివారం నాడు మరికల్ గ్రామంలోని జిల్లా పరిషత్ బాలుర ఉన్నంత పాఠశాల గెలుపొందిన క్రీడాకారులకు యూవక మండలి అధ్యక్షులు శ్రీకాంత్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి శ్రీనివాసులు ఆధ్వర్యం లో బహుమతుల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నారాయణపేట జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎస్ సూర్య మోహన్ రెడ్డి, మరికల్ గ్రామ సర్పంచ్ చెన్నయ్య,ఉప సర్పంచ్ , ఖాజా, మరికల్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వీరన్న, మరికల్ పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు హరీష్ కుమార్, నాయకులు రామన్ గౌడు, రాఘవేంద్ర, రామకృష్ణ,గోవర్ధన్, పెంట మీద రఘు, మరికల్ మాజీ ఎంపీటీసీ సీమ గోపాల్, రామకృష్ణారెడ్డి, అఖిలపక్ష నాయకులు గొల్ల రాజేష్ వీర బసంత్ కుమార్ మాజీ సర్పంచ్ జగదీష్, బసవరాజు,ఎస్ కృష్ణయ్య, వెంకటేష్ గౌడ్ మరికల్ యువకమండలి కమిటీ సభ్యులు మరికల్ గ్రామ వార్డు సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

