నేటి సాక్షి, ధర్మారం: ధర్మారం ఆదర్శ పాఠశాలలో 2026–27 విద్యా సంవత్సరానికి ఆరవ తరగతి నుండి పదవ తరగతి వరకు ప్రవేశాల కోసం నిర్వహించిన పరీక్ష ఫలితాల ఆధారంగా మెరిట్ జాబితా విడుదల చేసినట్లు శుక్రవారం పాఠశాల ప్రిన్సిపల్ ఈరవేణి రాజ్ కుమార్ తెలిపారు. ఏప్రిల్ 19న నిర్వహించిన ప్రవేశ పరీక్షలో విద్యార్థులు సాధించిన మార్కుల ప్రకారం ఎంపికైన వారి పేర్లను తెలంగాణ మోడల్ స్కూల్ అధికారిక వెబ్‌సైట్‌తో పాటు పాఠశాల నోటీస్ బోర్డులో ప్రదర్శించినట్లు ఆయన పేర్కొన్నారు. సీటు పొందిన విద్యార్థులు స్టడీ సర్టిఫికెట్, గత విద్యా సంవత్సర ప్రోగ్రెస్ కార్డ్, కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాలు, ట్రాన్స్‌ఫర్ సర్టిఫికెట్, నాలుగు పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోలు, ఆధార్ జిరాక్స్‌తో నేరుగా ప్రిన్సిపల్‌ను సంప్రదించాలని సూచించారు. నిర్ణీత గడువులోగా రిపోర్ట్ చేయని విద్యార్థుల స్థానాలను డౌన్ మెరిట్ జాబితా ఆధారంగా భర్తీ చేయనున్నట్లు ఆయన తెలిపారు. మరిన్ని వివరాలకు విద్యార్థుల, తల్లిదండ్రుల సందేహాలకు పాఠశాలలో ప్రత్యేక అడ్మిషన్ కౌంటర్ ఏర్పాటు చేసినట్లు ప్రిన్సిపల్ వెల్లడించారు.





