Friday, May 8, 2026

*ఇందిరమ్మ ఇండ్లతో పేదలకు నెరవేరిన సొంతింటి కళ**మండల కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు మాలోత్ చరణ్ సింగ్*

*నేటిసాక్షి, నల్లబెల్లి* ఇందిరమ్మ ఇళ్లతో పేదల సొంతింటి కల నెరవేరుతుందని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు మాలోత్ చరణ్ సింగ్ అన్నారు. మండలంలోని బోల్లోనీపల్లి గ్రామంలో పోలుదాసరి భద్రయ్య విజయ నిర్మల దంపతులు నూతనంగా నిర్మించిన ఇందిరమ్మ ఇళ్లను శుక్రవారం కాంగ్రెస్ పార్టీ శ్రేణులతో కలిసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ….. కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల పథకం నిరుపేద కుటుంబాలకు సొంతింటి కలను సాకారం చేసే దిశగా ముందుకు సాగుతోందన్నారు. ఎన్నో సంవత్సరాలుగా అద్దె ఇళ్లలో, తాత్కాలిక గుడిసెల్లో జీవిస్తున్న పేదలకు ఈ పథకం ఆశాకిరణంగా మారిందన్నారు.ప్రతి కుటుంబానికి గౌరవప్రదమైన నివాసం కల్పించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాన్ని ప్రాధాన్యతగా తీసుకుందన్నారు. గ్రామాలలో అర్హులైన లబ్ధిదారులను ఎంపిక చేసి, దశల వారీగా ఇళ్ల మంజూరు ప్రక్రియను చేపడతామని తెలిపారు.ఈ కార్యక్రమంలో వరంగల్ జిల్లా కార్యదర్శి చిట్యాల తిరుపతి రెడ్డి, మండలం కాంగ్రెస్ పార్టీ బీసీ సెల్ అధ్యక్షుడు కుసుంబ రఘుపతి , గ్రామ సర్పంచ్ సిద్ధ సంతోష్, యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు పోలుదాసరి రాము, ఉప సర్పంచ్ బోళ్ల సర్వేశం,మాజీ వార్డు సభ్యుడు కళాలి సుధాకర్, 9వ వార్డు సభ్యుడు భూమ సురేష్, జిల్లా మునీందర్, మండల నాయకుడు బత్తిని మల్లయ్య, జెట్టి రామ్మూర్తి, మోహన్, కార్యకర్తలు పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News