Friday, May 8, 2026

పశువైద్య ఆరోగ్య శిబిరం ప్రజా పాలన లో భాగంగా రైతులకు పంపిణి

*నేటి సాక్షి, జగిత్యాల ప్రతినిధి:* ( గుండ ప్రశాంత్ గౌడ్ )ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా గొల్లపల్లి మండలం చిల్వకోడూర్ గ్రామంలో పశువైద్య ఆరోగ్య శిబిరాన్నీ గొల్లపల్లి మండల మార్కెట్ కమిటీ చైర్మన్ భీమ సంతోష్ గొల్లపల్లి మండల సర్పంచుల ఫోరం అధ్యక్షుడు దాసరి తిరుపతి గౌడ్ మండల పశు వైద్య అధికారి రవీందర్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు నిశాంత్ రెడ్డి ప్రారంభించారు.ఈ సందర్భంగా రైతులను ఉద్దేశించి మండల పశు వైద్య అధికారి రవీందర్ మాట్లాడుతూ ప్రజా పాలనభాగంగా పశువులకు గర్భకోశ చికిత్స శిబిరం ను ప్రతి గ్రామంలో నిర్వహిస్తున్నట్లు ఆయన వివరించారు. పశువులు ఉన్న రైతులకు కావలసిన మందులను పంపిణీ చేయడం జరుగుతుందన్నారు. పశువులకు వచ్చే వ్యాధుల నివారణపై రైతులకు పూర్తిస్థాయిలో అవగాహన కల్పించారు. పశువైద్య శిబిరాలను మరికల్ మండలం లో ఉన్న రైతులు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు ఇట్టి కార్యక్రమంలో చిల్వకోడూర్ గ్రామ ఉప సర్పంచ్ దీటి మహేష్ గారు, వార్డు సభ్యులు చొప్పదండి చంద్రయ్యా గారు, తోట్ల సంధ్యారాణి సురేష్ ,మార్కేట్ కమిటీ డైరెక్టర్ నక్క రాజయ్య మాజీ సర్పంచ్ దాసరి నారాయణ మాజీ పాక్స్ డైరెక్టర్ సికింకంతం నాగయ్య కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడు గుండి బుజ్జన్న మండల మైనారిటీ సెల్ అధ్యక్షుడు ఎండీ మజ్జు ముద్దం సాయికుమార్,కడ మొగిలి వెంగళదాస్ సాయి కుమార్,తాండ్ర నారాయణ తాండ్ర శ్రీనివాస్ గర్వందుల కనకయ్య గడ్డి కొమురయ్యా ముద్దం మల్లేశ్, గడ్డి రాజేష్, వెంగళదాస్ రాజేశం కొండవేణి తిరుపతి తాండ్ర మహేష్ ,రైతులు తదితరులు పాల్గొన్నారు

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News