Thursday, March 12, 2026

వికారాబాద్ ఆర్ టీ సి బస్సు స్టాండ్ లో కనీస వసతులు కల్పించాలి.పని చేయని సీ సి కెమెరాలు, బూజు పట్టిన పట్టించుకోని అధికారులు.ప్రయాణికులకు మంచినీళ్లు సౌకర్యం కల్పించాలి.అపరి సుబ్రంగా ఉన్న మరుగుదొడ్లు పట్టించుకొని అదికారులు.బస్టాండ్లలో నిత్యం పోలీస్లను నియమించాలి. సిపిఎం నాయకులు డిమాండ్.

నేటి సాక్షి వికారాబాద్:వికారాబాద్ ఆర్టీసీ బస్టాండ్ లో అనునిత్యం దొంగతనాలు పెరుగుతున్నాయి వాటిని అరికట్టాలని ప్రయాణికులకు విద్యార్థులకు రక్షణ కల్పించాలని బస్టాండ్ లో సందర్శించి ప్రయాణికులతో మాట్లాడుతూ వారికి వస్తున్న ఇబ్బందులు తెలుసుకోవడం జరిగింది. ఈ సందర్భంగా సిపిఎం డివిజన్ కార్యదర్శి సత్యనారాయణ, జిల్లా కార్యదర్శి మహిపాల్ మాట్లాడుతూ వికారాబాద్ జిల్లా కేంద్రంలో ఉన్న బస్ స్టాండ్ లో కనీస సౌకర్యాలు త్రాగునీరు అస్సలు లేదు. టాయిలెట్స్, మరుగుదొడ్లు,నీటి సౌకర్యం, సక్రమంగా లేవని, సీసీ కెమెరాలు, ఉన్న సక్రమంగా పనిచేయడం లేదు. అదనపు సిసి కెమెరాలు బస్టాండ్ మొత్తం కవర్ అయ్యే విధంగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలనీ ఎమ్మెల్యే కలెక్టర్ డీఎం గారికి డిమాండ్ చేయడం జరిగింది.గత మూడు రోజుల క్రితం వికారాబాద్ బస్టాండ్లో పెద్దెముల్ మండలం కొండాపూర్ గ్రామానికి చెందిన వ్యక్తులు బస్సు ఎక్కుతున్న క్రమంలో దొంగలు రెండు తులాలనర బంగారం పుస్తెలు గొలుసు దొంగలించడం జరిగింది. పోలీసులకు ఫిర్యాదు చేసిన బస్టాండ్ లో ఉన్న సిసి కెమెరాలు పనిచేయడం లేదు బస్టాండ్ లో జరిగేటటువంటి దొంగతనాలను అరికట్టాలంటే బస్టాండ్ నలుమూలల సిసి కెమెరాలు ఏర్పాటు చేయాలి. అనేకమంది ప్రయాణికులు వస్తూ ఉంటారు కాబట్టి విద్యార్థులు విద్యార్థినిలు వివిధ గ్రామాల నుండి వచ్చి బస్టాండ్ నుండి వెళ్తారు ఇలాంటి దొంగతనాలు, అమ్మాయిలపై జరుగుతున్న ఆకతాయిల వెధింపులు అరికట్టాలంటే బస్టాండ్లో ఉన్న సిసి కెమెరాలు ఊన్న వాటికన్నా అధిక సిసి కెమెరాలు పెట్టాలి బస్టాండ్లో ఇద్దరు కానిస్టేబుల్ నియమించాలి. ప్రయాణికులకు తాగడానికి నీరు ఏర్పాటు చేయాలని, మరుగుదొడ్లు బాగు చేయాలి. స్పీకర్ ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గంలో బస్ స్టాండ్ లో కనీసం సౌకర్యాలు లేకపోవడం దుర్మార్గం అన్నారు. సిపిఎం పార్టీ ఆర్టీసీ బస్టాండ్ లో కంట్రోల్ రూమ్ వద్ద సిపిఎం ఆధ్వర్యంలో ధర్నా చేసి నిరసన వెక్తం చేసి వికారాబాద్ ఆర్టీసీ డిఎంకు సమస్యలు విన్నవించడం జరిగింది. జిల్లా అధికారులు వెంటనే కలెక్టర్,స్పీకర్, సీఎం,డి ఏం స్పందించి ప్రయాణికులకు కనీస సౌకర్యాలు కల్పించాలని సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో డిమాండ్ చేయడం జరిగింది.లేనిచో స్పీకర్ ఇంటి ముందు ఆందోళన చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు రామకృష్ణ సుదర్శన్ నవీన్ ఎస్ ఎఫ్ ఐ జిల్లా కార్యదర్శి అక్బర్, బిచ్చయ్య పక్కిరియ్య ప్రయాణికులు విద్యార్థులు పాల్గొన్నారు

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News