నేటి సాక్షి ( ఇమ్మడి విజయ్ కుమార్ ): జనవరి 27 నుండి కర్ణాటకలోని మైసూర్ నగరంలో నిర్వహించే అంతర్ విశ్వవిద్యాలయ క్రికెట్ పోటీలకు, శాతవాహన యూనివర్సిటీ జట్టులో స్థానిక రామకృష్ణ డిగ్రీ కళాశాల విద్యార్థులు చెట్టే మనోజ్ . బీకాం..తపాలా హరీష్ బిఎస్సి ఎన్నికై శాతవాహన యూనివర్సిటీ జట్టుకు ప్రాతినిధ్యం వహించనున్నారు. ఇటీవల నిర్వహించిన యూనివర్సిటీ స్థాయి క్రికెట్ టోర్నమెంట్లో వీరిద్దరూ అత్యుత్తమ ప్రతిభ కనబరిచి కళాశాల జట్టును ద్వితీయ స్థానంలో నిలిపినారు. అదేవిధంగా గత రెండు సంవత్సరాలుగా ఇరువురు విద్యార్థులు వరుసగా జాతీయ స్థాయి పోటీలకు ఎన్నికవ్వడం గమనార్హం. ఎంపికైన విద్యార్థులను కళాశాల చైర్మన్ యాద రామకృష్ణ , డైరెక్టర్ పల్లెర్ల నరేష్ , ప్రిన్సిపాల్ కొక్కుల రాజేందర్, ఫిజికల్ డైరెక్టర్ సాయిచంద్ మరియు సిబ్బంది అభినందించారు.

