నేటి సాక్షి నారాయణపేట మే 7, ( రిపోర్టర్ ఇమామ్ సాబ్ ), నారాయణపేట జిల్లాలోని మరికల్ మండల పరిధిలోని ఇబ్రహీంపట్నం గ్రామంలో గురువారం గ్రామపంచాయతీ కార్యాలయంలో గ్రామ సర్పంచ్ నాగరాణి సమక్షంలో జీవ వైవిద్య కమిటీని ఎన్నుకోవడం జరిగింది. ఇబ్రహీంపట్నం గ్రామ పంచాయతీ కార్యదర్శి కవిత మాట్లాడుతూ జీవరాశులపై గ్రామస్తులకు అవగాహన కల్పించారు. అనంతరం కమిటీని ఎన్నుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో గ్రామ ఉపసర్పంచ్ మునిస్వామి, గ్రామ వార్డు సభ్యులు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.





