*నేటిసాక్షి,నల్లబెల్లి* మొక్కజొన్న బస్తాలను గోదాములకు తరలించడంలో అధికారుల నిర్లక్ష్యంపై నిరసన వ్యక్తం చేస్తూ ఎంసిపిఐయు ఆధ్వర్యంలో రైతులు గురువారం ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా పంటను రోడ్డుపై పోసి నిప్పంటించారు. అనంతరం వారు మాట్లాడుతూ… హమాలీలు లేరనే కారణంతో రైతులను ఇబ్బందులకు గురి చేస్తున్నారని అధికారుల నిర్లక్ష్యానికి నిరసన వ్యక్తం చేస్తూ ధర్నాకు దిగారు. విషయం తెలుసుకున్న తహసిల్దార్ ముప్పు కృష్ణ, ఎస్సై ప్రసన్నకుమార్ అక్కడికి చేరుకొని రైతులకు నచ్చజెప్పి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో రైతులు ఆందోళన విరమించారు. ఈ కార్యక్రమంలో దామ సాంబయ్య,మార్త నాగరాజు తదితరులు పాల్గొన్నారు.





