Wednesday, March 11, 2026

జనవాడ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో రోడ్డు భద్రతపై అవగాహన సదస్సు. నిర్వహించిన మోకిల పోలీసులు… రంగారెడ్డి జిల్లా

నేటి సాక్షి ప్రతినిధి ( సుధాకర్ గౌడ్) శంకర్ పల్లి; జనవరి 22.మోకిల పోలీసువారి ఆధ్వర్యంలో జనవాడ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల లో గురువారం రోడ్డు భద్రతపై( ఆ రైవ్ ఆ లైవ్) భాగంగా రోడ్డు భద్రత పై అవగాన సదస్సులు, ఎస్సే రైటింగ్, డ్రాయింగ్ కాంపిటీషన్ విద్యార్థులతో నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులను ఉద్దేశించి మోకిల ఇన్స్పెక్టర్ వీరబాబు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ రూల్స్ పాటించాలని,హెల్మెంట్ ,సీటు ధరించాలని తెలిపారు. మద్యం సేవించి వాహనాలు నడపరాదని, రాంగ్ రూట్ ,త్రిబుల్ రైడింగ్ చేయరాదని అన్నారు అలాగే వాహనం నడిపేటప్పుడు డాక్యుమెంట్స్ కలిగి ఉండాలని తెలిపారు.ఏదైనా ఎమర్జెన్సీ ఉంటే 100-Dail కి కాల్ చేసి సమాచారం ఇస్తే తక్షణమే తాము స్పందిస్తామని తెలిపారు. విద్యార్థులు బాగా చదువు కొని వృద్ధులోకి రావాలని ఆకాంక్షించారు, పోటీల్లో విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో DI సమరం రెడ్డి, ఎస్ఐలు ధర్మ, రాథోడ్, పద్మ, మండల విద్యాధికారి అక్బర్ ఉపాధ్యాయులు, పోలీస్ సిబ్బంది , విద్యార్థులు పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News